05 January, 2025
Subhash
దేశంలో గత ఐదారు రోజులుగా బంగారం ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేగంగా దూసుకుపోయిన ధరలను కాస్త బ్రేకులు పడ్డాయి.
తులం బంగారం ధర 1,40 లక్షల రూపాయల వరకు దాటేసిన బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
తాజాగా దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై భారీగా పెరిగింది. ఏకంగా తులంపై 2,400 వరకు పెరిగింది. అదే విధంగా వెండి కూడా అదే దారిలో పయనిస్తోంది.
ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,220 ఉండగా, అదే 22 క్యారెట్ల ధర రూ.1,26,700 వద్ద కొనసాగుతోంది.
ఇక ఇటీవల కిలో వెండి ధర 2,70 లక్షల వరకు వెళ్లగా, గత ఐదారు రోజుల నుంచి భారీగా దిగి వచ్చింది.
ప్రస్తుతం మాత్రం కిలోపై ఏకంగా 7 వేల రూపాయల వరకు పెరిగింది. దీంతో దేశీయంగా కిలో వెండి రూ.2,48 లక్షల వద్ద ఉండగా, హైదరాబాద్‌లో మాత్రం రూ.2,66 లక్షలు ఉంది.
ఈ బంగారం, వెండి ధరలు జనవరి 5వ తేదీన సాయంత్రం నాటికి నమోదైన ధరలు మాత్రమే. ఇంకా పెరగవచ్చు.
పండగల సీజన్‌లో బంగారం, వెండి ధరలు పెరుగుతుండటంతో మహిళల్లో ఆందోళన పెరుగుతోంది. సామాన్యుడు గ్రాము కొనాలంటేనే భయపడిపోతున్నాడు.