Gold Prices: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. రాత్రికి రాత్రి భారీ మార్పులు.. బుధవారం రేట్లు ఇలా..
బంగారం ధరలు బుధవారం కూడా పెరిగాయి. సోమవారం నుంచి ధరలు పెరుగుతూనే వస్తోన్నాయి. ఏ ఒక్క రోజు కూడా తగ్గడం లేదు. దీంతో కొనుగోలుదారులు షాక్‌కు గురవుతున్నారు. అంతర్జాతీయ పరిణామాలే ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. బుధవారం రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

అమెరికా-వెనిజులా మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడి ధరలు ఆమాతం పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం నుంచి గోల్డ్, వెండి రేట్ల పెరుగుదల నమోదవుతూనే ఉంది. వెనిజులా అధ్యక్షుడిని అమెరికా అదుపులోకి తీసుకోవడం జియో పాలిటిక్స్‌లో సంచలనంగా మారింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదొడుకులు నెలకొనగా.. అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది. ఈ కారణంతో పెట్టుబడి పెట్టేందుకు బంగారంను స్వర్గధామంగా పెట్టుబడిదారులు భావిస్తున్నారు. దీంతో గోట్లు, వెండి రేట్లు ఆకాశాన్నంటున్నాయి. బుధవారం మరోసారి గోల్డ్ రేట్లు పెరిగాయి. బుధవారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
బంగారం ధరలు ఇలా..
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ రేటు రూ.1,38,830గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,38,820 వద్ద స్థిరపడింది. అటు 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,27,260గా ఉంది.
-విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల ధర రూ.1,38,830 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,27,260 వద్ద స్థిరపడింది.
-చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,980 వద్ద కొనసాగుతోంది. మంగళవారం ఈ ధర రూ.1,39,970 వద్ద స్థిరపడింది. 22 క్యారెట్ల ధర రూ.1,28,310 వద్ద ట్రేడవుతోంది.
-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,830 వద్ద ప్రస్తుతం కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,38,820 వద్ద స్థిరపడింది.
-ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,38,980 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,27,410 వద్ద స్థిరపడింది.
వెండి ధరలు ఇలా..
-ఇక ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,53,100 వద్ద కొనసాగుతోంది
-హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.2,71,100గా ఉంది.
-చెన్నైలో కేజీ వెండి ధర రూ.2,71,100 వద్ద స్థిరపడింది
