Vastu Tip: వాస్తుప్రకారం..ఈ దిశలో మందార మొక్కను నాటితే మీ ఇంట సిరుల పంట పండినట్టే..!
కొన్ని రకాల మొక్కలు ఇంట్లో పెంచుకోవటం ద్వారా ఇంట్లో సమస్యలు తీరిపోతాయి. ఆర్థిక మానసిక లాభాలు సంతరించుకుంటాయని చెబుతున్నారు. అలాంటి వాటిల్లో మందార మొక్క కూడా ఒకటి. మందార మొక్కను ఇంట్లో సరైన దిశలో పెంచుకోవటం వల్ల మీ అదృష్టానికి తిరుగుండదని నిపుణులు సూచిస్తు్నారు.

మొక్కలు పెంచుకోవటం ఇంటికి అందాన్ని మాత్రమే కాదు..ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం.. కొన్ని రకాల మొక్కలు ఇంట్లో పెంచుకోవటం ద్వారా ఇంట్లో సమస్యలు తీరిపోతాయి. ఆర్థిక మానసిక లాభాలు సంతరించుకుంటాయని చెబుతున్నారు. అలాంటి వాటిల్లో మందార మొక్క కూడా ఒకటి. మందార మొక్కను ఇంట్లో సరైన దిశలో పెంచుకోవటం వల్ల మీ అదృష్టానికి తిరుగుండదని నిపుణులు సూచిస్తు్నారు.
మందార ఎరుపు, తెలుపు, పసుపు, గులాబీ వంటి విభిన్న రంగుల్లో అందంగా కనిపించే ఆకర్షణీయమైన పూల మొక్క.. మందార పువ్వు మీ తోట అందాన్ని పెంచడంతో పాటు దేవుడికి ఎంతో ప్రీతికరమైనది. వాస్తు శాస్త్ర ప్రకారంగా మందారం మొక్కను ఉత్తరం లేదా తూర్పు వైపున నాటడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో ఈ మొక్కను నాటడం ద్వారా ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి. లక్ష్మిదేవికి మందార పువ్వు అంటే చాలా ఇష్టం. మీ ఇంట్లో పూచే మందార పూలను అమ్మవారికి సమర్పించి పూజించాలి. ఈ పరిహారం చేయడం వల్ల మీ డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
మందార మొక్కను ఇంట్లో పెడితే మంగళ దోషం తొలగిపోతుందని నమ్ముతారు. జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నప్పుడు ఈ మొక్కను నాటాలి. ఇలా చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. మందార పువ్వులు లేకుండా సూర్యుని పూజించడం అసంపూర్ణం. సూర్య భగవానుడికి నీళ్లు సమర్పించేటప్పుడు మందార పువ్వులను ఆ నీటిలో వేయాలని చెబుతున్నారు. మందార మొక్కను పూజ గదికి దగ్గర ఉంచితే, అది ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి సహాయపడుతుంది. మందార మొక్కను శుక్రవారం నాడు ఇంటికి తెచ్చుకుంటే జాతకంలో గ్రహస్థితిని సరిచేస్తుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం, మందార మొక్కను శత్రువుకు బహుమతిగా ఇస్తే, అది ఇద్దరు వ్యక్తుల మధ్య ద్వేషాలను తగ్గించడానికి సహాయపడుతుందని వాస్తు, జ్యోతిశాస్త్రనిపుణులు సూచిస్తున్నారు.
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..








