Tollywood: టాలీవుడ్ క్రేజ్ అలాంటిది మరి! ఆ విషయంలో తెలుగు సినిమాలను ఫాలో అవుతున్న కోలీవుడ్, మాలీవుడ్
దక్షిణాది సినిమా ప్రపంచంలో భారీ మార్పులు జరుగుతున్నాయి. ‘బాహుబలి’ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ సాధించిన తర్వాత, తెలుగు సినిమా పాన్-ఇండియా రిలీజ్‌లతో ముందంజలో నిలిచింది. ఇప్పుడు, ఇక్కడికి పరిమితమైన కన్నడ, మలయాళ ఇండస్ట్రీలు కూడా భారీ బడ్జెట్ చిత్రాలతో పోటీ పడుతున్నాయి. ఈ మార్పు ..

దక్షిణాది సినిమా ప్రపంచంలో భారీ మార్పులు జరుగుతున్నాయి. ‘బాహుబలి’ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ సాధించిన తర్వాత, తెలుగు సినిమా పాన్-ఇండియా రిలీజ్‌లతో ముందంజలో నిలిచింది. ఇప్పుడు, ఇక్కడికి పరిమితమైన కన్నడ, మలయాళ ఇండస్ట్రీలు కూడా భారీ బడ్జెట్ చిత్రాలతో పోటీ పడుతున్నాయి. ఈ మార్పు వెనుక ‘కేజీఎఫ్’, ‘కాంతార’ వంటి కన్నడ హిట్లు, ‘లోక చాప్టర్ 1’ వంటి మలయాళ సినిమాల సక్సెస్ ఉంది. ఈ చిత్రాలు దక్షిణాదిలో మాత్రమే కాకుండా, ఉత్తర భారతంలో కూడా భారీ రెస్పాన్స్ పొంది, ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాయి.
కన్నడలో ‘కేజీఎఫ్’ యశ్‌ను సూపర్‌స్టార్ చేసింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ యాక్షన్ ఎపిక్, గోల్డ్ మైనింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రాజ్ (యశ్) జీవితాన్ని చిత్రిస్తూ పాన్-ఇండియా బజ్ క్రియేట్ చేసింది. దీని సక్సెస్‌తో ‘కేజీఎఫ్ 2’ వచ్చి 1000 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ‘కేజీఎఫ్ 3’పై అంచనాలు భారీగా పెరిగాయి.
అలాగే, ‘కాంతార’ (రిషబ్ శెట్టి డైరెక్షన్, లీడ్ రోల్) కల్చరల్ మైథాలజీతో మిక్స్ అయిన సస్పెన్స్ థ్రిల్లర్‌గా హిట్ అయింది. దక్షిణాది మాత్రమే కాకుండా హిందీలో కూడా సూపర్ హిట్. కాంతార చాప్టర్ 1’ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. మరో పార్ట్ కూడా తెరకెక్కనుందని, భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా రేంజ్‌లో తీస్తారని వార్తలు వస్తున్నాయి.
మలయాళంలో ‘లోక చాప్టర్ 1’ కూడా ఇండస్ట్రీకి కొత్త దిశ చూపింది. ఈ ఫ్యాంటసీ యాక్షన్ చిత్రం, మలయాళ సినిమాను భారీ బడ్జెట్ లెవెల్‌కు తీసుకెళ్లి, దేశవ్యాప్తంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ‘లోక చాప్టర్ 2’ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సక్సెస్‌లు కన్నడ, మలయాళ ఇండస్ట్రీలను టాలీవుడ్, కోలీవుడ్‌తో సమానంగా నిలబెట్టాయి. పాన్-ఇండియా క్రేజ్‌తో ఈ ఫ్రాంచైజీలు మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. దక్షిణ సినిమా భవిష్యత్తు ఈ భారీ ప్రాజెక్టుల్లోనే ఉందని టాక్!




