Dhurandhar: ‘ధురంధర్’ డైరెక్టర్ భార్య టాలీవుడ్‌లో ఫేమస్ హీరోయిన్ అని తెలుసా? ఏయే సినిమాలు చేసిందంటే?
ధురంధర్.. ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న సినిమా. రణ్ వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ ఇప్పటికే రూ. 500 కోట్లకు చేరువలో ఉంది. త్వరలోనే ఈ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగులోనూ రిలీజ్ కానుంది.

రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ధురంధర్. రిలీజ్ కు ముందే నెగెటివిటీని మూటగట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. డిసెంబర్ 05న రిలీజైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం 500 కోట్లకు చేరువలో ఉంది. ప్రస్తుతం ధురంధర్ జోరు చూస్తుంటే 2025లో బాలీవుడ్ టాప్ గ్రాసర్ గా నిలిచే అవకాశముంది. ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నాడు. మరి ఈ సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ ఎవరో తెలుసా? ఆదిత్య ధర్. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు.. కానీ.. సుమారు ఆరేళ్ల క్రితమే (2019)లో ఉరి అనే ఓ సూపర్ హిట్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు ఆదిత్య. తన ప్రతిభకు ప్రతీకగా మొదటి సినిమాకే ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. అయితే ఉరి తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరీ ధురంధర్ సినిమాను తెరకెక్కించాడు ఆదిత్య ధర్. అయితే ఈ మధ్య కాలంలో అతను ఆర్టికల్ 370, ధూమ్ ధామ్, బారాముల్లా వంటి బ్లాక్ బస్టర్స్ మూవీకి స్క్రీన్ రైటర్ గా వ్యవహరించాడు.
అన్నట్లు ఈ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ భార్య కూడా ఫేమస్ హీరోయిన్. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోందామె. తెలుగు ఆడియెన్స్ కు కూడా ఈ ముద్దుగుమ్మ పరిచయం. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా? ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న యామీ గౌతమ్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆదిత్య ధర్.
భార్య యామీ గౌతమ్ తో ధురంధర్ డైరెక్టర్..
View this post on Instagram
ఆదిత్య ధర్ మొదటి సినిమా ఉరిలో కథానాయికగా నటించింది యామీ గౌతమ్. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత 2021 జూన్ లో పెద్దల అనుమతితో ఇద్దరూ పెళ్లిపీటలెక్కారు. గతేడాది ఈ దంపతులకు వేదవిద్ ధార్ అనే అబ్బాయి పుట్టాడు. ఇక బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న యామీ గౌతమ్ తెలుగులోనూ చాలా సినిమాలు చేసింది. నువ్విలా, కొరియర్ బాయ్ కల్యాణ్, గౌరవం, యుద్ధం సినిమాల్లో కథానాయికగా చేసింది. అయితే 2015లో రిలీజైన కొరియర్ బాయ్ కల్యాణ్ తర్వాత కేవలం బాలీవుడ్ కే పరిమితమైందీ అందాల తార.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








