Viral Video: చిల్లర డబ్బుతో ఖరీదైన ఐఫోన్ కొన్న బిచ్చగాడు..ఆ సీన్‌ చూస్తే అవాక్కే..! ఏం జరిగిందంటే..

బిచ్చగాడు స్టోర్‌లోకి వెళ్లడంతో స్టోర్‌లోని సిబ్బంది, అక్కడి ప్రజలు యాపిల్ షోరూమ్‌లోకి ఎందుకు వస్తున్నాడో అనుకుని షాక్‌తో చూడటం మొదలుపెట్టారు. కానీ, అతడు కొత్తగా లాంచ్ చేసిన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్ కొనేందుకు షాప్‌కి వచ్చానని చెప్పడంతో తొలుత అక్కడున్న వారంతా తమాషాగా భావించి లైట్ తీసుకున్నారు. అయితే

Viral Video: చిల్లర డబ్బుతో ఖరీదైన ఐఫోన్ కొన్న బిచ్చగాడు..ఆ సీన్‌ చూస్తే అవాక్కే..! ఏం జరిగిందంటే..
Beggar Buying Iphone With C
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 09, 2024 | 11:36 AM

iPhone 15 pro Max: ఐఫోన్ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది అది ధనికులు ఉపయోగించే ఫోన్ అని. ఎందుకంటే.. ఐఫోన్‌ అంటేనే అత్యంత ఖరీదైనది. అందుకే పేదవాడిని ఐ ఫోన్ ధర ఎంత అని అడిగితే, లక్షల్లో ఖరీదు చేస్తుందని చెబుతారు. ఈ ఫోన్ కొనాలంటే మాలాంటి వాళ్లు కిడ్నీలు అమ్ముకోవాల్సిందే అంటారు. కానీ, ఈ నమ్మకాలన్నింటినీ తారుమారు చేస్తూ ఓ బిచ్చగాడు చిల్లర డబ్బులతో ఖరీదైన ఐ ఫోన్‌ను కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది.

ప్రస్తుతం ఐఫోన్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఎవరి చేతిలో చూసిన ఐఫోన్ మెరుస్తూ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు? అని మీరు అడగవచ్చు. దానికి కారణం ఏమిటంటే, ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబడ్డాయి. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు షోరూమ్‌ల వద్ద జనం బారులు తీరుతున్నారు. ఖరీదైన ఐఫోన్‌ కొనేందుకు ఓ బిచ్చగాడు కూడా స్టోర్‌కి వచ్చాడు.. చిల్లర నాణేలన్నీ సేకరించి యాపిల్ స్టోర్ కు వచ్చి మొబైల్ ఫోన్ కొన్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఒళ్లంగా పూర్తిగా మురిగా ఉండి, చిరిగిపోయిన బనియెన్‌, లుంగీ కట్టుకుని ఉన్న ఓ యువకుడు హై-ఫై యాపిల్ స్టోర్‌లోకి ప్రవేశించాడు. యువకుడి తీరు చూస్తుంటే అతడు ఓ బిచ్చగాడు అని అంటున్నారు నెటిజన్లు. కానీ, అతడు భుజంపై ఓ బట్ట సంచిని వేసుకుని యాపిల్ షోరూమ్‌లోకి ప్రవేశించాడు. బిచ్చగాడు స్టోర్‌లోకి వెళ్లడంతో స్టోర్‌లోని సిబ్బంది, అక్కడి ప్రజలు యాపిల్ షోరూమ్‌లోకి ఎందుకు వస్తున్నాడో అనుకుని షాక్‌తో చూడటం మొదలుపెట్టారు. కానీ, అతడు కొత్తగా లాంచ్ చేసిన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్ కొనేందుకు షాప్‌కి వచ్చానని చెప్పడంతో తొలుత అక్కడున్న వారంతా తమాషాగా భావించి లైట్ తీసుకున్నారు. అయితే బ్యాగులోంచి చిల్లర మొత్తం స్టోర్‌లోని ఫ్లోర్‌ మీద కుమ్మరించాడు. ఇదే డబ్బుతో తాను ఫోన్ కొనుక్కోవడానికి వచ్చానని చెప్పడంతో అక్కడున్న జనం ఒక్కసారిగా అవాక్కయ్యారు.

వీడియో ఇక్కడ చూడండి..

యాపిల్ స్టోర్ ఫ్లోర్‌లో తను తెచ్చిన బ్యాగుల్లో చిల్లర నాణేలన్నింటినీ పోసి, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్ ఇవ్వాలని దుకాణ యజమానిని అడిగాడు. దీంతో ఆ యాపిల్ స్టోర్‌లోని సిబ్బంది అంతా ఆ చిల్లర నాణేలను లెక్కించడం ప్రారంభించారు. కొన్ని గంటలు పాటు ఆ డబ్బును లెక్కించిన అనంతరం రూ.1.59 లక్షలు విలువ చేసే ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ను ఆ బిచ్చగాడికి విక్రయించారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌కు గురై రకరకాలుగా స్పందించడం మొదలుపెట్టారు. ఈ డబ్బుతో బతుకుతెరువుని ఏర్పాటు చేసుకోలేని మూర్ఖుడంటూ కొందరు తమ అభిప్రాయాన్ని భిన్నంగా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..