AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold ETF: మతిపోగొట్టే రాబడి ఇస్తున్న గోల్డ్‌ ETFలు..! 2026లో మరింత పెరిగే అవకాశం ఉందా అంటే..?

బంగారం, వెండి ధరలు 2025లో భారీ రాబడిని అందించాయి, ముఖ్యంగా గోల్డ్ ETFలు 72 శాతం పైగా లాభపడ్డాయి. స్టాక్, క్రిప్టో మార్కెట్లను మించిపోయాయి. ప్రపంచ వడ్డీ రేట్ల తగ్గింపులు, బలహీనమైన డాలర్, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లతో బంగారం 'సేఫ్ హెవెన్'గా మారింది.

Gold ETF: మతిపోగొట్టే రాబడి ఇస్తున్న గోల్డ్‌ ETFలు..! 2026లో మరింత పెరిగే అవకాశం ఉందా అంటే..?
Gold 2
SN Pasha
|

Updated on: Dec 15, 2025 | 9:56 PM

Share

బంగారం, వెండి ధరలు ఈ ఏడాది ఎలా పెరిగాయో అందరికీ తెలిసిందే. బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి భారీ రాబడి అందించాయి. ఈ సంవత్సరం అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఆస్తులుగా ఉద్భవించాయి. ఇవి స్టాక్, క్రిప్టో మార్కెట్ల నుండి వచ్చే రాబడిని మించిపోయాయి. 2025లో బంగారం పెరుగుదల పెట్టుబడిదారులను ఈ మార్కెట్ వైపు ఆకర్షించింది ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) వరుసగా ఏడవ నెలలోనూ పెట్టుబడులు పెరిగాయి.

AMFI డేటా ప్రకారం.. నవంబర్‌లో బంగారు ETFలపై పెట్టుబడిదారుల ఆసక్తి బలంగా ఉంది. రూ.3,741 కోట్ల నికర పెట్టుబడులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం ఉత్తమ పనితీరు కనబరిచిన బంగారు ETFలు 72 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించాయి, పెట్టుబడిదారులకు వాటి ఆకర్షణను మరింత పెంచాయి. ఛాయిస్ వెల్త్ రిసెర్చ్‌ అండ్‌ ప్రొడక్షన్‌ విభాగాధిపతి అక్షత్ గార్గ్ మింట్ నివేదికలో మాట్లాడుతూ.. ర్యాలీ నిస్సందేహంగా బలంగా ఉందని, దీనికి మార్కెట్ వాతావరణం కొంతవరకు కారణమని అన్నారు. ప్రపంచ వడ్డీ రేటు తగ్గింపులను ఊహించి, సురక్షితమైన స్థలాలను వెతుక్కుంటూ పెట్టుబడిదారులు ETFలలోకి డబ్బును కుమ్మరించారు. దీనితో బంగారం ధరలు సాధారణం కంటే పెరిగాయి.

అయితే డిమాండ్ వాతావరణం, బలమైన మద్దతు అలాగే ఉందని గార్గ్ స్పష్టం చేశారు, ఎందుకంటే కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు చేస్తూనే ఉన్నాయి, US డాలర్ బలహీనంగా ఉంది. బలహీనమైన డాలర్ ఇతర కరెన్సీలను కలిగి ఉన్నవారికి బంగారాన్ని చౌకగా చేస్తుంది. ఇంకా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తాయని భావిస్తున్నారు, దీనివల్ల వడ్డీ లేని బంగారాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది.

గోల్డ్ ఈటీఎఫ్‌లలో ర్యాలీ కొనసాగుతుందా?

2026లో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల ధరలు మరింత పెరుగుదలకు అవకాశం ఉందని, కానీ వేగం కొంతవరకు మధ్యస్థంగా ఉండవచ్చని చెబుతున్నారు. బంగారం కొనుగోళ్లకు, బంగారు ఇటిఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడానికి కొన్ని ముఖ్య కారణాలు ఇక్కడ ఉన్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి