Ketu Transit: కేతువుతో ఆ రాశుల వారికి ఆకస్మిక శుభాలు, ధన యోగాలు..!
జ్యోతిషశాస్త్రంలో వక్ర గ్రహమైన కేతువు, ప్రస్తుతం సింహ రాశిలో తనకు అత్యంత ఇష్టమైన పుబ్బా నక్షత్రంలో సంచరిస్తోంది. మే 2025 వరకు ఈ సంచారం కొనసాగుతుంది. ఈ ప్రత్యేక స్థితి కారణంగా మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, ధనూ రాశులకు అద్భుతమైన ధన యోగాలు, ఊహించని లాభాలు, శుభ ఫలితాలు కలగనున్నాయి. అనేక ఆర్థిక సమస్యలు పరిష్కారమై, సంపద వృద్ధి చెందే అవకాశం ఉంది.

Ketu Transit in Pubba Star
జ్యోతిషశాస్త్రంలో వక్ర గ్రహంగా, పాప గ్రహంగా పేరున్న కేతు గ్రహం ప్రస్తుతం సింహ రాశిలో తనకు అత్యంత ఇష్టమైన పుబ్బా నక్షత్రంలో సంచారం చేస్తోంది. పుబ్బా నక్షత్రం శుక్రుడికి చెందిన నక్షత్రం కావడం వల్ల కేతువు ఎక్కువగా శుభ ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది. వచ్చే ఏడాది మే నెల వరకూ కేతువు శుక్రుడికి చెందిన ఈ పుబ్బా నక్షత్రంలోనే సంచారం చేస్తుంది. ఈ కేతువు వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు అనుభవానికి రావడమే కాకుండా ఒకటి రెండు ధన యోగాలు పట్టే అవకాశం కూడా ఉంది. మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, ధనూ రాశుల వారు ఈ కేతు సంచారం వల్ల అత్యధికంగా లాభాలు పొందడం జరుగుతుంది.
- మేషం: ఈ రాశికి కేతువు పంచమ స్థానంలో ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ముఖ్యంగా షేర్లు, స్పెక్యులేషన్లు, జూదాలు, లాటరీలు, ఆర్థిక లావాదేవీల వంటివి అంచనాలకు మించి లాభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు కొద్ది మార్పులతో లాభాలనిస్తాయి. సంతాన యోగం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గే అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశివారికి తృతీయ స్థానంలో కేతువు సంచారం వల్ల ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం కూడా బాగా వృద్ది చెందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. ఆస్తిపాస్తులకు సంబంధించిన వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.
- కర్కాటకం: ఈ రాశికి ధన స్థానంలో సంచారం చేస్తున్న కేతువు వల్ల ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. లాటరీలు, జూదాలు, షేర్లు, స్పెక్యులేషన్ల వంటి వాటివల్ల ఇబ్బడిముబ్బడిగా లాభాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. రావలసిన సొమ్ముతో పాటు బాకీలు, బకాయిలు కూడా వసూలవుతాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. విదేశీ సంపాదనను అనుభవించే అవకాశం ఉంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది.
- సింహం: ఈ రాశిలో కేతువు సంచారం వల్ల ఇంటా బయటా ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదా, జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. అనుకోని మార్గాలలో ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి, లాటరీలు, జూదాలు, షేర్ల ద్వారా డబ్బు సంపాదించడానికి బాగా అవకాశం ఉంది. వారసత్వ సంపద లభించే అవకాశం ఉంది. రావలసిన సొమ్మును, మొండి బాకీలను రాబట్టుకుంటారు.
- తుల: ఈ రాశివారికి లాభ స్థానంలో కేతు సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగు పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు కూడా బాగా లాభిస్తాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.
- ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచరిస్తున్న కేతువు వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. అనుకోకుండా ఆస్తి లాభం, భూ లాభం కలుగుతాయి. భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం అంచనాలను మించుతుంది. ఆస్తి వివాదాలు బాగా అనుకూలంగా పరిష్కారమవుతాయి. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి.



