15 December 2025

చాణక్య నీతి : వ్యక్తి గౌరవాన్ని నాశనం చేసే ఆరు అలవాట్లు ఇవే!

samatha

Pic credit - Instagram

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన ఎన్నో విషయాల గురించి గొప్పగా తెలియజేయడం జరిగింది. అలాగే ఒక వ్యక్తి గౌరవాన్ని పొగొట్టే విషయాల గురించి కూడా తెలిపారు.

తెలియకుండా, ఒక వ్యక్తి చేసే రోజూ వారి అలవాట్లే వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తాయంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

వ్యక్తి అలవాట్లు అనేవి భవిష్యత్తులో ప్రతి అడుగులోనూ ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకే గౌరవం పెరగడానికి తప్పకుండా మంచి అలవాట్లు అలవరచుకోవాలంట.

అతిగా మాట్లాడటం, చాణక్యుడి ప్రకారం, ఒక వ్యక్తి అతిగా మాట్లాడటం తన ప్రతిష్టను దెబ్బతీస్తాయి. అందుకే అతిగా కాకుండా, అవసరం ప్రకారం మాట్లాడాలంట.

మితిమీరిన కోపం వినాశనానికి దారితీస్తుంది. అందుకే మితిమీరిన కోపాన్ని చూపకూడదు, ఇదే అతి పెద్ద శత్రువు అంట.

చాణక్య నీతి ప్రకారం, మితిమీరిన దురాశ, వ్యక్తి నైతికతను దూరం చేస్తుందని, స్వార్థం మీ నాశనానికే అంట.

చాణక్య నీతి అహంకారం పతనానికి కారణమని పేర్కొంది. మితిమీరిన గర్వం, నటన మొదట్లో ఆకట్టుకోవచ్చు, కానీ కాలక్రమేణా, వాటి అసలు రంగులు బయటపడతాయి

ప్రతిదాని గురించి ఫిర్యాదు చేయడం మరియు ప్రతికూల దృక్పథాన్ని కలిగి ఉండటం కూడా ఒకరి ప్రతిష్టను దెబ్బతీస్తుందని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు