AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana News: సీబీఐ కేసులో అరెస్ట్ చేస్తామంటూ వీడియో కాల్.. కట్‌చేస్తే ఖాతాలోంచి రూ.15 లక్షలు ఉష్ కాకి

ఆ వెంటనే వీడియో కాల్ లోకి వచ్చిన మరో ముగ్గురు వ్యక్తులు కలిసి నర్సింహారావుతో మాట్లాడి బెదిరింపులకు పాల్పడ్డారు. వీడియో కాల్ లో ఉన్న అగంతకులు నర్సింహారావుకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నర్సింహారావు మాత్రం అగంతకులకు కనిపించాడు.

Telangana News: సీబీఐ కేసులో అరెస్ట్ చేస్తామంటూ వీడియో కాల్.. కట్‌చేస్తే ఖాతాలోంచి రూ.15 లక్షలు ఉష్ కాకి
Cyber Fraud
N Narayana Rao
| Edited By: |

Updated on: Dec 09, 2024 | 1:19 PM

Share

సీబీఐ నుంచి ఫోన్ చేస్తున్నాము..మీ దగ్గర హవాలా డబ్బు ఉంది హవాలా వ్యాపారం చేస్తున్నారు..సుప్రీంకోర్టు నుంచి సమన్లు వచ్చాయని మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని బెదిరించారు..ఖమ్మం జిల్లా వైరాలో ఓ రిటైర్డు ఉద్యోగి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. రూ.15 లక్షల సొమ్మును తన బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్ల అకౌంట్ కు బదిలీ చేశారు. ఆ తర్వాత బంధువులకు తెలియడంతో వెంటనే బాధితుడితో కలిసి వైరా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు…

గత శుక్ర, శనివారాల్లో ఈ సైబర్ నేరగాళ్ల బెదిరింపులతో బాధితుడు ఊటుకూరి నర్సింహారావు భయంతో హడలెత్తి పోయారు. వైరా మున్సిపాలిటీ 13వ వార్డు ఉంటున్న విశ్రాంత ఉద్యోగి ఊటుకూరి నర్సింహారావు ఈ సైబర్ నేరగాళ్ల బాధితుడయ్యాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా కమలాపురంలోని ఓ పేపర్ బోర్డులో ఉద్యోగిగా పనిచేసి రిటైర్డ్ అయి నర్సింహారావు వైరాలో నివాసముంటున్నారు. ఆయనకు శుక్రవారం మధ్యాహ్నం వాట్సఫ్ ఫోన్ కాల్ వచ్చింది. తాము ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి ఫోన్ చేస్తున్నామని, మీరు ఐదు విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్నారని, ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించారు. తాను ఎలాంటి విమాన టిక్కెట్లు బుక్ చేసుకోలేదని నర్సింహారావు సమాధానమివ్వడంతో ఈ విషయం ఏదో తేడాగా ఉందని సీబీఐకి ఫిర్యాదు అందిందని వాట్సఫ్ కాల్ చేసిన సదరు వ్యక్తి బెదిరించాడు.

ఆ వెంటనే వీడియో కాల్ లోకి వచ్చిన మరో ముగ్గురు వ్యక్తులు కలిసి నర్సింహారావుతో మాట్లాడి బెదిరింపులకు పాల్పడ్డారు. వీడియో కాల్ లో ఉన్న అగంతకులు నర్సింహారావుకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నర్సింహారావు మాత్రం అగంతకులకు కనిపించాడు. మీ దగ్గర హవాలా డబ్బు ఉందని, మీరు మోసంతోనే హవాలా వ్యాపారం చేస్తున్నారని, సుప్రీంకోర్టు నుంచి ఆ మేరకు సమన్లు వచ్చాయని, మిమ్మల్ని అరెస్టు చేయాల్సి ఉంటుందని బెదిరించారు. మిమ్మల్ని అరెస్టు చేయకుండా విచారించాలంటే సుప్రీంకోర్టు సమన్లు మేరకు రూ.15 లక్షలను సుప్రీంకోర్టు ఆడిట్ విభాగానికి జమచేయాలని ఆదేశించారు. ఈ విషయాన్ని మీ బంధువులకు,స్నేహితులకు, పోలీసులకు, ఇతరులకు ఎవరికైనా చెబితే వెంటనే అరెస్టు చేస్తామని బెదిరించటంతో నర్సింహారావు భయపడిపోయాడు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఆ మర్నాడు శుక్రవారం మాదిరిగానే శనివారం కూడా సైబర్ నేరగాళ్లు నర్సింహారావుకు ఇదే విధంగా వీడియోకాల్ చేసి బెదిరించారు. కోల్ కత్తాలోని బంధన్ బ్యాంకులోని రామాఎంటర్పెజస్ ఖాతాలో రూ.15 లక్షలు జమచేయాలని, లేనట్లయితే వెంటనే అరెస్టు చేస్తామని బెదిరించారు. దీంతో హడలెత్తిపోయిన నర్సింహారావు శనివారం మధ్యాహ్నం వైరాలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ లో ఉన్న తన ఖాతా నుంచి సైబర్ కేటుగాళ్లు ఆదేశించిన ఖాతా నెంబర్ కు రూ.15 లక్షలు బదిలీ చేశారు. అంతటితో ఆగకుండా మళ్లీ మరో రూ.5లక్షలు బదిలీ చేయాలని సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు దిగారు. ఆ తర్వాత కొంతసేపటికి తమ ఇంటికి వచ్చిన బంధువులకు నర్సింహారావు భయంతో వణికిపోతూ ఈ విషయాన్ని తెలిపారు. వెంటనే బంధువులు నర్సింహారావుకు ధైర్యం చెప్పి వైరా పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైరా పోలీసులు కేసు నమోదు చేసి రాష్ట్ర సైబర్ క్రైం విభాగానికి బదిలీ చేశారు…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!