తులసి ఆకులు తింటే ఈ రోగాలన్నీ మాయం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇలా చేస్తే..

తులసి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. తులసి ఆరోగ్యకరమైన రక్త ప్రవాహాన్ని నిర్వహించడానికి, కొలెస్ట్రాల్ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజూ ఉదయాన్నే..

తులసి ఆకులు తింటే ఈ రోగాలన్నీ మాయం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇలా చేస్తే..
Tulsi
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 09, 2024 | 12:26 PM

మన ప్రకృతిలో ఉన్న అనేక మొక్కలు, వృక్షాలలో ఎన్నో ఔషధ గుణాలు నిండివున్నాయి. అందులో అతి ముఖ్యమైనది అత్యంత పవిత్రమైనది తులసి మొక్క. మన పూర్వీకుల కాలం నుంచి తులసిని అత్యంత పవిత్రమైనదిగా కొలుస్తూ వస్తున్నారు. పురాణాలలో కూడా తులసి మొక్కను విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావిస్తారు. ఇలాంటి తులసిని నేడు ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తులసిలోని ఔషధ గుణాలు ఆరోగ్యంతోపాటు సౌందర్య పోషణలో కూడా మేలు చేస్తాయి. తులసిలోని కొమ్మలు, ఆకులు, విత్తనాలు, కాడలు, వేర్లు, వేర్ల దగ్గరి మట్టి కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి తులసిలోని మరిన్ని లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఆయుర్వేదం ప్రకారం తులసి అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్క. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ వ్యాధులను నివారించడానికి తులసిని ఉపయోగిస్తారు. తులసిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. తులసిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా శరీరాన్ని రక్షిస్తాయి. ముఖ్యంగా ఈ చలికాలంలో తులసి ఆకులను తేనెలో ముంచి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే జలుబు, తుమ్ములు, దగ్గు, గొంతునొప్పి మొదలైన వాటి నుండి ఉపశమనం పొందవచ్చు. తులసిలో శరీరంలో మంటను తగ్గించే సమ్మేళనాలు ఉన్నాయి.

తులసి ఆకులతో టీ తయారు చేసుకుని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి శరీర, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి ఆకులను నమలడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఖాళీ కడుపుతో తులసి నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణక్రియను కూడా సులభతరం చేస్తుంది. తులసిలో ఉండే యూజీనాల్ అనే సమ్మేళనం టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. తులసి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. తులసి ఆరోగ్యకరమైన రక్త ప్రవాహాన్ని నిర్వహించడానికి, కొలెస్ట్రాల్ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజూ ఉదయాన్నే తులసి టీ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..