Sweet Potato: ఈ ఒక్క దుంపతో ఆ అనారోగ్య సమస్యలన్నీ ఫసక్.!
చిలగడదుంప తెలియనివారుండరు. శీతాకాలంలో విరివిగా లభించే ఈ దుంపలో ఎన్నో పోషకాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఇవి క్యాన్సర్‌ను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు. అంతేకాదు ఈ తియ్యని దుంపలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. చిలగడ దుంపలలో ఫైబర్, విటమిన్లు ఏ, సీ, బీ6, పొటాషియం, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
చిలగడదుంప వ్యాధులు రాకుండా చూస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పోషకాహార లోపం సమస్య రాకుండా చూస్తాయి. చిలగడ దుంపలలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోకి చేరిన తర్వాత విటమిన్ ఏగా మారుతుంది. ఇది కంటి చూపుని మెరుగుపరుస్తుంది. చిలగడ దుంపలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణశక్తిని మెరుగుపరిచి.. మలబద్దకాన్ని నివారిస్తుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల శరీరాన్ని ఉత్సాహంగా ఉంచడంతో పాటు రోగనిరోధక శక్తినీ పెంచుతాయి.
బరువు తగ్గాలనుకునేవారు కూడా హ్యాపీగా ఈ చిలగడ దుంపలను తినవచ్చు. తియ్యగా ఉన్నా.. వీటిలో షుగర్ ను కంట్రోల్ చేసే సమ్మేళనాలు ఉంటాయని చెబుతున్నారు. చిలగడ దుంపలలో ఉండే పొటాషియం హై బీపీని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వీటిలో ఉండే ఆంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు వాపులు, నొప్పులను తగ్గిస్తాయి. చిలగడ దుంపలను చాలా మంది నీటిలో ఉడకబెట్టి తింటుంటారు. కానీ.. వీటిని నిప్పుల్లో కాల్చుకుని తినడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మైక్రో-ఓవెన్ లో కూడా చిలగడ దుంపలను కాల్చుకుని తినవచ్చు. చిలగడ దుంపలో ఉండే ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్‌ను అడ్డుకుంటాయి. అలాగే మూత్రాశయం, పెద్ద ప్రేగు, కడుపు, రొమ్ములో పెరిగే కాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. చిలగడ దుంపలను తినడం వల్ల మెదడు పని తీరు మెరుగుపడుతుంది. ఇది కేవలం మీ సమాచారం కోసం మాత్రమే. మీ ఆరోగ్య సమస్యలను బట్టి వైద్య నిపుణులను సంప్రదించాకే నిర్ణయం తీసుకోవాలి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

