AP 10th Exams: పదో తరగతి పరీక్షల తేదీ ఖరారు.! ఏపీ సర్కార్ యాక్షన్ ప్లాన్..
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది మార్చిలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే పరీక్ష ఫీజు చెల్లింపుల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. డిసెంబర్ నెలాఖరు వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే టెన్త్ పబ్లిక్ పరీక్షలను మార్చి 15వ తేదీ నుంచి నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి నెలాఖరుకల్లా పరీక్షలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
టెన్త్ పబ్లిక్ పరీక్షలను మార్చి 15వ తేదీ నుంచి నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి నెలాఖరుకల్లా పరీక్షలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు పాఠశాల విద్యా శాఖ 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను విడుదల చేసింది. టైమ్ టేబుల్‌తో కూడిన ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ ఉన్నత పాఠశాలలకు పంపించింది. దీని ప్రకారం ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు సెషన్లలో పదో తరగతి విద్యార్ధులకు తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని విద్యాశాఖ ఆయా పాఠశాలలను ఆదేశించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.