Human Washing Machine: మనుషులను ఉతికి ఆరేసే కొత్త వాషింగ్ మెషీన్.! కూర్చోగానే 15 నిమిషాల్లో..
రోజూ ఉదయాన్నే స్నానం చేయాలంటే చాలామంది బద్దకిస్తుంటారు. అదేదో చాలా కష్టమైన పనిలా ఫీలవుతారు. స్నానం చేయకుండా గంటలు తరబడి గడిపేస్తారు. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. స్నానం చేయడానికి పెద్దగా కష్టపడకుండా ఇలాంటి వారికోసం ఓ మెషిన్ కనిపెట్టారు జపాన్‌వాళ్లు. బట్టలు ఉతికినట్టు మనుషులను ఉతికి ఆరేసే మెషిన్ అందుబాటులోకి రానుంది.
జపాన్‌లోని ఒసాక కేంద్రంగా పనిచేసే ‘సైన్స్ కో’ సంస్థ హ్యూమన్ వాషింగ్‌మెషిన్‌ను రూపొందించింది. ఈ మెషిన్ ఒక మనిషిని కేవలం 15 నిమిషాల్లో శుభ్రం చేసేస్తుందట. ఇది చూడటానికి ఫైటర్‌జెట్ కాక్‌పిట్ ఆకారంలో ఉంటుంది. ఒసాకా కన్సాయి ఎక్స్‌పోలో 1,000 మంది అతిథులు ప్రయోగాత్మకంగా దీనిని వాడుకొనేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రదర్శన తర్వాత మాస్ ప్రొడక్షన్ వెర్షన్‌ను విడుదల చేస్తామంటోంది. పారదర్శకంగా ఉండే ఈ ప్లాస్టిక్ పాడ్‌లోకి మనిషి ఒకసారి ప్రవేశించాక.. ఆ క్యాప్సుల్‌లో సగానికిపైగా ప్రదేశం గోరువెచ్చని నీటితో నిండుతుంది. ఆ తర్వాత అందులోని హైస్పీడ్ జెట్స్ నుంచి ఈ మెషీన్.. నీటిని వేగంగా విరజిమ్ముతుంది. ఈ నీటిలో మూడు మైక్రోమీటర్ల పరిమాణంలోని అతి సూక్ష్మ బుడగలు ఉంటాయి.
ఇవి మనిషి శరీరం మీద ఉన్న మురికిపై తీవ్రమైన ఒత్తిడి సృష్టించి దానిని తొలగిస్తాయి. అంతేకాదు.. స్నానం చేసే వ్యక్తిని మానసికంగా, ఉత్సాహంగా ఉంచేందుకు దీనిలో ఏర్పాట్లు ఉన్నాయట. ఇందులోని పరికరాలు మనిషి శరీరానికి సంబంధించిన కీలక సమాచారం సేకరిస్తాయి. కృత్రిమ మేథ ద్వారా ఆ వ్యక్తి మౌనంగా ఉన్నాడా.. ఉత్సాహంగా ఉన్నాడా అనేది అంచనా వేసి.. తగిన వీడియోను ఆ పాడ్‌లో ప్రసారం చేస్తాయి. వాస్తవానికి ఇది అత్యాధునిక యంత్రమని అనుకొంటాం. కానీ, దీనిని 50ఏళ్ల క్రితం డిజైన్ ఆధారంగా తయారుచేశారట. 1970లో జపాన్ వరల్డ్ ఎక్స్‌పో శానియో ఎలక్ట్రిక్ కో కంపెనీ అయిన ప్రస్తుత పానసోనిక్ దీనిని మొదటిసారి తయారుచేసింది. ఆ వెర్షన్‌తో పోలిస్తే కొత్త దానిలో అత్యధిక మసాజ్ బాల్స్ వంటివి అమర్చినట్లు తయారీదారులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.