Goods Train: రన్నింగ్‌లో రెండు ముక్కలైన గూడ్స్‌ రైలు.! వీడియో వైరల్..

Goods Train: రన్నింగ్‌లో రెండు ముక్కలైన గూడ్స్‌ రైలు.! వీడియో వైరల్..

Anil kumar poka

|

Updated on: Dec 09, 2024 | 8:54 AM

పట్టాలపై వేగంగా దూసుకెళ్తున్న గూడ్స్ ట్రైన్ ఒక్కసారిగా రెండు ముక్కలైంది. మధ్యలో లింక్ తెగిపోవడంతో కొన్ని బోగీలు వెనకే ఉండిపోయాయి. సిగ్నల్ పడకున్నా రైలు స్లో అవుతోంది ఏంటని చూసిన గార్డ్ కు బోగీల మధ్య లింక్ తెగిపోయి కనిపించింది. దీంతో లోకో పైలట్ ను అప్రమత్తం చేశారు. వెంటనే రైలును నిలిపేసి అధికారులకు సమాచారం అందించారు లోకోపైలట్‌. తెలంగాణలోని మహబూబాబాద్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం డోర్నకల్ రైల్వే స్టేషన్ నుంచి కాజీపేటకు వెళ్తున్న గూడ్స్ రైలు మహబూబాబాద్ స్టేషన్ సమీపంలో రెండుగా విడిపోయింది. బోగీల మధ్య లింక్ తెగిపోవడంతో వేగంగా వెళుతున్న గూడ్స్ రైలు ఇంజన్ నుంచి కొన్ని పెట్టెలు దూరమయ్యాయి. గూడ్స్ గార్డ్ వాకీటాకీ ద్వారా లోకో పైలట్ కు సమాచారం అందించి రైలును ఆపేశాడు. విషయం తెలిసి ఆ మార్గంలో వెళ్లాల్సిన రైళ్లను ఉన్నతాధికారులు నిలిపివేశారు. దీంతో ప్రమాదం తప్పినట్లయింది. ముందుకు వెళ్లిపోయిన రైలును వెనక్కి తీసుకువచ్చి లింక్ కలిపాక అధికారులు రైలును పంపించారు. కాగా, ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని, లింక్ తెగిపోవడానికి కారణాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.