Resume For maid: వంట మనిషికి రెజ్యూమ్.! వెల్లువలా వస్తున్న జాబ్ ఆఫర్లు..
మీరు ఏదైనా ఉద్యోగం కోసం వెళితే అక్కడ మీ బయోడేటా లేదా రెజ్యూమ్ అడుగుతారు. దానిని చూసి మీరు ఆ ఉద్యోగానికి సరిపోతారో లేదో నిర్ణయించుకుంటారు. ప్రైవేట్ రంగంలో పనిచేసే నిపుణులందరికీ రెజ్యూమ్ అవసరం. అయితే వంట మనిషి కోసం కూడా రెజ్యూమ్ చేస్తారని మీకు తెలుసా? బెంగళూరు వ్యక్తి తన వంట మనిషి కోసం రెజ్యూమ్ తయారు చేశాడు. ఆ రెజ్యూమ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు జాబ్ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.
ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వరుణ్ అనే వ్యక్తి తన వంట మనిషి ఉర్వి కోసం రెజ్యూమ్ రూపొందించాడు. వేరే వ్యక్తి వంట మనిషి గురించి ఎంక్వైరీ చేసినపుడు వరుణ్ ఈ రెజ్యూమ్ను ఫార్వార్డ్ చేశాడు. మీరు కచ్చితంగా రీతూ దీదీని మాస్టర్ షెఫ్‌ను పరిగణించాలి. ఆమె తన పనిని అద్భుతంగా చేస్తుంది. ఆమె తయారు చేసే హోమ్లీ ఫుడ్ ఉత్తమమైంది. నేను ఆమెకు ఒక రెజ్యూమ్ను తయారు చేశారు. ఎందుకంటే ఆమె దానికి అర్హురాలు అని వరుణ్ పేర్కొన్నాడు. ఉర్వి సామర్థ్యాలు, ఆమె వంట చేసే విధానం, ఆమె ఏయే వంటలు చేయడంలో నిష్ణాతురాలు వంటి విషయాలను పాయింట్ టు పాయింట్ రాసుకొచ్చాడు.
అంతేకాదు, ఉర్వి.. నేపాలీ, హిందీ, కొద్దిగా ఇంగ్లీష్ కూడా మాట్లాడగలదని రెజ్యూమ్లో తెలిపాడు. వరుణ్ తయారు చేసిన రెజ్యూమ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరుణ్ చేసిన పోస్ట్‌ను దాదాపు 1.2 లక్షల మంది చూసారు. వెయ్యి మందికి పైగా లైక్ కొట్టారు. చాలా మంది ఉర్వికి ఫోన్ చేసి జాబ్ ఆఫర్లు ఇస్తున్నారు. వంట మనిషికి అంత అద్భుతంగా రెజ్యూమ్ క్రియేట్ చేసిన వరుణ్ క్రియేటివిటీని మరికొందరు మెచ్చుకుంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్
భారీగా పెరిగిన జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..

