Bleeding Eye Virus: తరుముకొస్తున్న మరో ప్రాణాంతక వైరస్.. 21 రోజుల్లోనే మరణం.!

Bleeding Eye Virus: తరుముకొస్తున్న మరో ప్రాణాంతక వైరస్.. 21 రోజుల్లోనే మరణం.!

Anil kumar poka

|

Updated on: Dec 09, 2024 | 12:26 PM

కరోనా వైరస్‌ సృష్టించిన మారణహోమాన్ని ఇంకా పూర్తిగా మర్చిపోకముందే మరో ప్రాణాంతక వైరస్‌ దాడికి సిద్ధమైంది. అదే బ్లీడిండ్‌ ఐ వైరస్‌. ఇప్పటికే 'బ్లీడింగ్ ఐ' వైరస్ రువాండాలో 15 మందిని పొట్టన పెట్టుకుంది. వందలాది మందికి వేగంగా సోకింది. ఇది వెలుగులోకి వచ్చినప్పటి నుంచి గత రెండు నెలల్లో ఏకంగా 17 ఆఫ్రికన్ దేశాలకు వ్యాపించింది.

బ్లీడింగ్ ఐ వైరస్‌ను గతంలో మార్బర్గ్ హెమరేజిక్ జ్వరం అని పిలిచేవారు. ఇది ప్రాణాంతక అంటువ్యాధి. ఈ వైరస్‌ ఓ రకమైన గబ్బిలం నుంచి వ్యాపిస్తుంది. ఇన్‌ఫెక్షన్ సోకిన రెండు నుంచి 21 రోజులలోపు ఈ వైరస్‌ లక్షణాలు బయటపడతాయి. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, అనారోగ్యంతోపాటు కండరాల నొప్పులు దీని ప్రధాన లక్షణాలు. ఈ వైరస్‌ సోకిన మూడవ రోజు నుండి విరేచనాలు, కడుపునొప్పి, తిమ్మిర్లు, వికారం, వాంతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 5 వ రోజు నుండి వాంతులు, మలంలో రక్తం, ముక్కు, కళ్ళు, చెవులు, నోరు, చిగుళ్ళు నుండి రక్తస్రావం అవుతుంది. రోగలక్షణం ప్రారంభమైన ఎనిమిది నుండి తొమ్మిది రోజుల వ్యవధిలో మరణం సంభవిస్తుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తుల రక్తం, స్రావాలు, అవయవాలు, ఇతర శారీరక ద్రవాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. బ్లీడింగ్ ఐ సోకిన రోగులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు కూడా దీని బారిన పడుతున్నారు. రోగిని ప్రత్యక్షంగా తాకినా ప్రాణాపాయమే. బ్లీడింగ్ వైరస్‌కు ఇప్పటి వరకు ఎలాంటి చికిత్స అందుబాటులో లేదు. టీకాలు లేదా యాంటీవైరల్ చికిత్సలు కూడా లేవు. అయితే రీహైడ్రేషన్‌తో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, రోగలక్షణాలను బట్టి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.