Planetary: భగ భగ మండుతూ భూమిపైకి దూసుకొచ్చిన గ్రహశకలం.! వీడియో..
అంతరిక్షంలో భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలాన్ని శాస్త్రవేత్తలు చివరి క్షణంలో గుర్తించారు. దాని సైజును అంచనా వేస్తూ.. అది ఎక్కడ పడుతుందనే లెక్కలు కడుతుండగానే ఆ గ్రహశకలం భూమిని తాకింది. 70 సెంటీ మీటర్ల వ్యాసార్థం గల ఈ గ్రహ శకలాన్ని గుర్తించిన 12 గంటల్లోనే అత్యంత వేగంగా దూసుకొచ్చి భూమిపై పడిపోయింది.
అదృష్టవశాత్తూ ఆ గ్రహశకలం చిన్నది కావడం, రష్యాలోని మారుమూల ప్రాంతంలో పడడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని యురోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఆకాశంలో నిప్పులు చిమ్ముతూ దూసుకొచ్చిన ఈ గ్రహశకలాన్ని చూసి రష్యాలోని యకుతియా ప్రాంతంలోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వాతావరణంలోనే అది మండిపోవడంతో కాసేపు మెరుపులు మెరిశాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రష్యా కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటిగంట ప్రాంతంలో ఈ గ్రహశకలం భూమిని తాకింది. భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత గ్రహశకలానికి నిప్పంటుకుంది. భగభగ మండుతూ ముక్కలుగా విడిపోయి భూమిపై పడింది. యకుతియా ప్రాంతం భూమిపై అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో ఒకటి. మంగళవారం రాత్రి కూడా అక్కడ మైనస్ 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, ఈ ఘటనతో భూమి సమీపంలో అంతరిక్షంలో తిరుగుతున్న శకలాల పైన ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.