Indoor Plants: వాస్తుప్రకారం ఇంటికి అదృష్టాన్ని తెచ్చే మొక్కలు ఇవి.. సంపద మీ వెంట ఉన్నట్లే!

వాస్తు ప్రకారం ఇంట్లో ఈ ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటే ఎటువంటి సమస్యలు రావు అంటున్నారు నిపుణులు. అలాంటి వాస్తు సంబంధిత మొక్కలు, వాటి విశిష్టత ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

Indoor Plants: వాస్తుప్రకారం ఇంటికి అదృష్టాన్ని తెచ్చే మొక్కలు ఇవి.. సంపద మీ వెంట ఉన్నట్లే!
Indoor Plants
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 09, 2024 | 1:07 PM

వాస్తు ప్రకారం కొన్ని చిట్కాలు ఫాలో అవ్వడంతో ఇంటికి అదృష్టం వస్తుందని పలువురు వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు నమ్మకం, మొక్కలంటే ప్రాణం ఉన్నవారు తప్పక ఇలాంటి నమ్ముతారు. వాస్తు ప్రకారం ఇంట్లో ఈ ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటే ఎటువంటి సమస్యలు రావు అంటున్నారు నిపుణులు. అలాంటి వాస్తు సంబంధిత మొక్కలు, వాటి విశిష్టత ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

జేడ్ ప్లాంట్‌: జేడ్ ప్లాంట్‌ చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటుంది. జేడ్ ప్లాంట్‌ను ఇండోర్ ప్లాంట్‌గా పెంచుకుంటే ఇంటికి అదృష్టం కలుగుతుందని పలువురు నమ్ముతారు. అంతేకాదు.. దీనిని కుబేర మొక్క అని కూడా పిలుస్తారు. క్రాసులా మొక్క అని కూడా అంటారు. చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే ఈ మొక్కను నాటమని సలహా ఇస్తున్నారు. ఇది ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని పారదొలుతుందని, ఇంట్లో పాజిటివిటీని పెంచుతుందని నమ్ముతారు. తద్వారా ఇంట్లో శ్రేయస్సు, సంపద పెరుగుతుందని నమ్మకం.

స్నేక్ ప్లాంట్‌: వాస్తు ప్రకారం.. ఇంటికి అదృష్టాన్ని అందించే మొక్కల్లో స్నేక్‌ప్లాంట్‌ కూడా ఒకటి. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల అదృష్టం, పాజిటివ్‌ ఎనర్జీ, శ్రేయస్సు లభిస్తాయి. దీనినే మదర్​ ఇన్​ లా ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఇంట్లో, ఆఫీసుల్లో ఈ మొక్కలు పెట్టుకుంటే అదృష్టం కలిసొస్తుందని చెబుతారు వాస్తు శాస్త్ర నిపుణులు. అంతేకాదు ఇది గాలిలో ఉండే విషపూరిత వాయువుల్ని పీల్చుకుని గాలిని శుభ్రంగా మారుస్తుంది.

ఇవి కూడా చదవండి

మనీ ట్రీ: మనీ ట్రీ దీన్నే పచిరా ఆక్వాటికా అని అంటారు. దీన్ని ఇంట్లో పెంచుకోవడం వల్ల సంపదలో వృద్ధి ఉంటుంది. ఈరోజుల్లో చాలా మంది ఇళ్లలో దీనిని పెంచుకుంటున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇది దాని పేరుకు తగినట్లుగానే సంపద, అదృష్టాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు. అలాగే ఈ మొక్క డబ్బును ఆకర్షిస్తుందని చెబుతారు. అయితే దీని కొమ్మలు నేలకు తాకకుండా చూసుకోవాలి. అంతేకాకుండా ఈ మొక్క ప్రతికూల శక్తి, ఆందోళన స్థాయిలను తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

తులసి: తులసి మొక్కను వేదాల ప్రకారం లక్ష్మీదేవీ స్వరూపంగా భావిస్తారు. తులసి మొక్క వల్ల ఇంటికి శ్రేయస్సు లభిస్తుంది. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైనది తులసి. అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన అదృష్ట మొక్కలలో ఒకటి తులసి మొక్క. ఇది ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తుల్ని పారద్రోలి పాజిటివిటీని పెంచుతుంది. ఈ మొక్కను ఇంట్లో పెంచితే సంపద, అదృష్టం, ప్రేమ అన్నీ మీ సొంతమవుతాయి. ఆర్థికంగా సక్సెస్ అవడానికి సహాయపడుతుంది.

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..