AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఉమ్ములోనే మీ ఆరోగ్య రహస్యం.. నోటిలో వచ్చే చిన్న మార్పులను లైట్ తీసుకుంటే అంతే సంగతులు..

లాలాజలం కేవలం జీర్ణక్రియకే కాకుండా మీ ఆరోగ్యం గురించి అనేక సంకేతాలను ఇస్తుంది. నోరు పొడిబారడం, మందపాటి లేదా నురుగు లాలాజలం, అధిక లాలాజలం, రంగు మార్పులు వంటివి డయాబెటిస్, డీహైడ్రేషన్, గుండె సమస్యలు, ఒత్తిడి లేదా ఇతర తీవ్రమైన వ్యాధుల లక్షణాలు కావచ్చు.

మీ ఉమ్ములోనే మీ ఆరోగ్య రహస్యం.. నోటిలో వచ్చే చిన్న మార్పులను లైట్ తీసుకుంటే అంతే సంగతులు..
Saliva Reveals Health Secrets
Krishna S
|

Updated on: Dec 12, 2025 | 1:26 PM

Share

మన శరీరంలో లాలాజలం అనేది చాలా ముఖ్యమైనది. దీని పని కేవలం ఆహారం జీర్ణం అవ్వడానికి, నోరు శుభ్రంగా ఉంచడానికే కాదు. మనకు ఏమైనా పెద్ద జబ్బులు ఉన్నాయా అనే విషయాన్ని కూడా ఇది చెప్పగలదు. మన శరీరం రోజుకు దాదాపు 1.5 లీటర్ల లాలాజలాన్ని తయారు చేస్తుంది. నిపుణుల ప్రకారం.. లాలాజలం యొక్క రంగు, రుచి, పరిమాణం మారితే అది ప్రమాదకరమని అర్థం. మనం సాధారణంగా భావించే లాలాజలంలో వచ్చే చిన్న మార్పులు కూడా ఈ ఆరోగ్య సమస్యలను సూచిస్తాయి.

నోరు ఎండిపోవడం

తగినంత లాలాజలం ఉత్పత్తి కాని పరిస్థితిని జిరోస్టోమియా అంటారు. ఇది ఈ సమస్యలకు లక్షణం కావచ్చు.

ఇవి కూడా చదవండి

డయాబెటిస్: రక్తంలో చక్కెర నియంత్రణ లేకపోవడాన్ని సూచిస్తుంది.

డీహైడ్రేషన్: శరీరంలో నీరు తక్కువగా ఉందని అర్థం.

స్జోగ్రెన్స్ సిండ్రోమ్: లాలాజల గ్రంథులను ప్రభావితం చేసే స్వయం ప్రతిరక్షక వ్యాధి.

మందుల ప్రభావం: కొన్ని రకాల మందులు (అలెర్జీ మందులు) నోరు పొడిబారేలా చేస్తాయి.

స్లీప్ అప్నియా: నోటితో శ్వాస తీసుకునే అలవాటు ఉంటే కూడా నోరు పొడిబారుతుంది

మందపాటి లేదా నురుగు లాంటి లాలాజలం

లాలాజలం బయటకు వచ్చే నాళాలలో కాల్షియం గడ్డకట్టి రాళ్లు ఏర్పడవచ్చు. కడుపులోని యాసిడ్ గొంతు వరకు వస్తుంటే ఉమ్ము పుల్లని రుచిగా లేదా నురుగుగా ఉండవచ్చు.

అధిక లాలాజలం

కడుపుకు సంబంధించిన సమస్యలు లేదా గుండెల్లో మంట ఉండవచ్చు. గర్భధారణ సమయంలో ఇది సర్వసాధారణం. కొన్నిసార్లు నరాలకు సంబంధించిన సమస్యలను కూడా ఇది సూచించవచ్చు.

రంగు మారడం లేదా రక్తం

చిగుళ్ల నుంచి రక్తం కారడం లేదా నోటి ఇన్ఫెక్షన్లు ఉన్నాయని అర్థం. కొన్నిసార్లు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను కూడా లాలాజలం ద్వారా తెలుసుకోవచ్చు.

ఒత్తిడి

లాలాజలంలో ఉండే ఒక హార్మోన్ స్థాయిలను బట్టి మీరు ఎంత ఒత్తిడి లేదా ఆందోళనతో ఉన్నారో కూడా తెలుసుకోవచ్చు. ఈ చిన్న మార్పులను గమనిస్తే.. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి పెద్ద సమస్యల లక్షణాలను కూడా డాక్టర్లు ముందుగానే గుర్తించడానికి వీలవుతుంది. కాబట్టి లాలాజలంలో ఏవైనా పెద్ద మార్పులు గమనిస్తే, వెంటనే డాక్టర్‌ను కలవడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..