AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలంలో ఆ బాధలు పోవాలంటే.. బాబా రామ్‌దేవ్ చెప్పిన అద్భుత స్నాక్ తినాల్సిందే..

Baba Ramdev: చలికాలంలో చాలా మంది నీరసంగా, అలసటతో బాధపడతుంటారు. రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. ఈ సమయంలో ఫాస్ట్ ఫుడ్‌కు బదులుగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. యోగా గురువు బాబా రామ్‌దేవ్ చుర్మాను సిఫార్సు చేస్తున్నారు. నెయ్యి, చక్కెర మిల్లెట్ రోటీతో తయారయ్యే ఈ దేశీ చిరుతిండితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

చలికాలంలో ఆ బాధలు పోవాలంటే.. బాబా రామ్‌దేవ్ చెప్పిన అద్భుత స్నాక్ తినాల్సిందే..
Baba Ramdev Winter Snack
Krishna S
|

Updated on: Dec 12, 2025 | 1:01 PM

Share

చలికాలం వచ్చిందంటే ప్రజలకు నీరసంగా, అలసటగా అనిపించడం సర్వసాధారణం. ఈ కాలంలో రోగనిరోధక శక్తి కూడా బలహీనపడి, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు పెరుగుతాయి. అంతేకాకుండా ఈ చలిలో చాలా మంది మోమోస్, చౌమెయిన్ వంటి అనారోగ్యకరమైన ఫాస్ట్ ఫుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఆహారాలు ఆరోగ్యానికి హానికరమని యోగా గురువు బాబా రామ్‌దేవ్ హెచ్చరించారు. నిపుణుల సలహా ప్రకారం.. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే, రోగనిరోధక శక్తిని పెంచే, బలాన్ని ఇచ్చే ఆహారాలను తీసుకోవడం అవసరం. ఈ నేపథ్యంలో బాబా రామ్‌దేవ్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన ఒక సాంప్రదాయ దేశీ వింటర్ స్నాక్ గురించి తెలిపారు.

రామ్‌దేవ్ సూచించిన చలికాలపు చిరుతిండి

బాబా రామ్‌దేవ్ తాను ఫాస్ట్ ఫుడ్ అస్సలు తిననని బదులుగా చలికాలంలో చుర్మాను ఇష్టపడతానని తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో వెల్లడించారు. ఈ చుర్మాను ఆయనే స్వయంగా తయారు చేసుకుంటారట. మిల్లెట్ రోటీలో నెయ్యి, చక్కెర వేసి బాగా కలిపి ఈ చలికాలంలో తింటానని ఆయన తెలిపారు. రామ్‌దేవ్ ప్రకారం.. ఈ దేశీ చిరుతిండి శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

మిల్లెట్ రోటీ యొక్క ప్రయోజనాలు

మిల్లెట్ బ్రెడ్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఫెలిక్స్ హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ డి.కె. గుప్తా వివరించారు.

శక్తి, వెచ్చదనం: ఇది చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. తక్షణ శక్తిని అందిస్తుంది.

రక్తంలో చక్కెర నియంత్రణ: రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

పోషకాలు: మిల్లెట్ గ్లూటెన్ రహిత ధాన్యం. ఇది కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు (బి కాంప్లెక్స్), ముఖ్యమైన ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది.

అందుకే చలికాలంలో మోమోస్ వంటి అనారోగ్యకరమైన ఆహారాలకు బదులుగా బాబా రామ్‌దేవ్ సూచించిన ఈ దేశీ పోషక విలువలు ఉన్న చిరుతిండిని ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

View this post on Instagram

A post shared by Swami Ramdev (@swaamiramdev)