53 ఏళ్ల తర్వాత .. ఫిబ్రవరి 6న ఆర్టెమిస్-2
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. చంద్రుడిపై మనుషి రెండోసారి కాలుమోపే క్షణం సమీపిస్తోంది. ఐదు దశాబ్దాల తర్వాత చందమామను వెతుక్కుంటూ మనిషి పయనం కాబోతున్నాడు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ‘ఆర్టెమిస్-2’ మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములను చందమామ చెంతకు పంపించబోతోంది. ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది నాసా.
ఫిబ్రవరి 6న అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రయోగం చేపట్టనున్నట్టు నాసా తాజాగా ప్రకటించింది. అపోలో ప్రోగ్రామ్ 1972లో ముగిసిన తర్వాత తొలి మానవ సహిత మిషన్ ఇది. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 14 వరకు లాంచ్ విండో ఓపెన్ అయి ఉంటుందని, ఫిబ్రవరి 6న ఈ ప్రయోగం జరగకపోతే, 7, 8, 10, 11 తేదీల్లో ఏదో ఒక రోజు జరగవచ్చని నాసా తెలిపింది. ఈ మిషన్‌లో నాసా వ్యోమగాములు రీడ్ వైజ్‌మేన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగామి జెరెమీ హాన్సెన్ వెళ్తారు. 10 రోజులపాటు చంద్రుని చుట్టూ ఈ మిషన్ తిరుగుతుంది. ఆ తర్వాత భూమిపైకి వస్తుంది.ఇది చంద్రుని చుట్టూ కక్ష్యలో తిరగదు, చంద్రునిపై దిగదు. లైఫ్ సపోర్ట్ పరికరాలను పరీక్షించడం కోసం కొన్నిసార్లు భూమి కక్ష్యలో తిరుగుతుంది. మానవులు చంద్రునిపై మరోసారి అడుగుపెట్టడానికి ముందు, ఇది ట్రయల్ మిషన్. ఆర్టెమిస్-3 మానవులను చంద్రునిపైకి తీసుకెళ్లి, దించుతుంది.
మరిన్ని వీడియోల కోసం