ఏ క్షణమైనా అమెరికా దాడి.. ఎయిర్ స్పేస్‌ను మూసేసిన ఇరాన్
మిడిల్ ఈస్ట్ నివురుగప్పిన నిప్పులా కనిపిస్తోంది. ఎప్పుడు భగ్గుమంటుందో తెలియని పరిస్థితి ఉంది. 24 గంటల్లోనే అమెరికా దాడులు చేయొచ్చని తెలుస్తోంది. ఇరాన్‌లో పౌరులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా అమెరికా రియాక్ట్ అవుతుందని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. దీంతో ఇరాన్ NOTAM జారీ చేసింది. వెంటనే విమానాలన్నింటినీ దారిమళ్లించాయి విమానయాన సంస్థలు. ఎయిర్ ఇండియా కూడా ట్రావెల్ అడ్వైజరీ జారీచేసింది. ఇరాన్ ఎయిర్‌స్పేస్ మీద నుంచి కాకుండా ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్తామని ప్రకటించింది. ఇప్పటికే లిఫ్ట్ ఆఫ్ అయిన విమానాలను రీరూట్ చేస్తున్నామని చెప్పింది. మిడిల్ ఈస్ట్ నుంచి బలగాలను వెనక్కి పిలిపిస్తోంది అమెరికా.. ఖతార్ ఎయిర్‌బేస్‌లో పది వేల మందితో కూడిన అమెరికా బలగాలున్నాయి. వీరిలో చాలామందిని స్వదేశానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఇరాన్‌కు తొలి టార్గెట్ ఖతారే అవుతుందన్న ఆందోళనల నేపథ్యంలో అక్కడి నుంచి బేస్‌ను ఖాళీ చేస్తోంది అమెరికా. అంటే.. నేడో రేపో ఇరాన్‌పై దాడులు ఉండొచ్చనేది స్పష్టమవుతోంది. ఇరాన్‌లో భారీ స్థాయిలో హింస కనిపిస్తోంది. నార్వే మానవహక్కుల సంస్థ ఇరాన్ అల్లర్లను నిశితంగా పరిశీలిస్తోంది. 18 రోజుల అల్లర్లలో 14 రోజుల డేటాను విడుదల చేసింది. 3వేల 428 మంది చనిపోయినట్లు ప్రకటించింది. అయితే అనధికారికంగా ఇరాన్‌లో 20 వేల మంది వరకు చనిపోయి ఉండొచ్చన్న అంచనాలున్నాయి. నిరసనలు ఎక్కడ కనిపించినా.. భారీ మెషీన్‌గన్లతో కాల్పులు జరుపుతున్నాయి ఇరాన్ బలగాలు. సోవియట్ కాలంనాటి 12.7 ఎంఎం బులెట్లు కలిగిఉన్న మెషీన్ గన్లను వాడుతోంది ఇరాన్ ఆర్మీ. చాలామంది నిరసనకారులు ఇస్లామిక్ రెజీమ్‌కు వ్యతిరేకంగా వారు కట్టించిన ప్రార్థనా స్థలాలను కూల్చేస్తున్నారు. దీంతో సొంత ప్రజలను పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపుతోంది. ఇది ఆగకపోతే ఇరాన్‌ను దేవుడు కూడా కాపాడలేడని చెబుతోంది. అయితే ఇరాన్‌లో జరుగుతున్న హింస బయటకు రావొద్దన్న కారణాలతో వారం రోజులుగా ఇంటర్నెట్‌ను నిలిపివేసింది అక్కడి ప్రభుత్వం. నిరసనలు ఎక్కడ జరిగినా.. పవర్‌కట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం
ఇరాన్‌లో నిరసన కారులను అణచివేస్తున్న ప్రభుత్వం వీడియో
అమెరికా సెగతో ఇరాన్ లో అట్టుడికిన ఆందోళనలు! వీడియో
నా మనవడికి భోగి పళ్లు పోస్తున్నాం వీడియో
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
EPFO గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఆ సేవలు
స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్..భారీగా పెరగనున్న ధరలు!
టైగర్ సఫారీలో జీప్‌లో పర్యాటకులు..కళ్ళెదుట ఆ సీన్ చూసి షాక్
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
