టైగర్ సఫారీలో జీప్‌లో పర్యాటకులు..కళ్ళెదుట ఆ సీన్ చూసి షాక్
ఉత్తరప్రదేశ్‌లోని దూధ్వా టైగర్ రిజర్వ్ భారతదేశంలోని ప్రధాన వన్యప్రాణుల అభయారణ్యాల్లో ఒకటి. ఇక్కడ పులులు, ఎలుగుబంట్లు, ఖడ్గమృగాలతో పాటు 400కి పైగా పక్షి జాతులు ఉన్నాయి. దీంతో ఇది గొప్ప జంతుజాలాన్ని కలిగిన ప్రదేశంగా విశేష గుర్తింపు పొందింది. సాధారణంగా పులులు 60 నుంచి 100 చ.కి.మీటర్ల విస్తీర్ణంలో తిరుగుతుతాయి. పులికి వేట పైన విశేషపట్టు ఉంటుంది. వేటకు సిద్ధమైతే 20 అడుగుల దాకా ఎగరగలదు. 50 కి.మీ. వేగంతో పరుగెత్తగలదు. పులి శరీరంపై ఉండే ఆకుపచ్చ రంగు ముడుతలు ప్రతి ఒక్క పులికి ప్రత్యేకంగా ఉంటాయి. మనిషికి ఉండే ఫింగర్‌ప్రింట్‌లా అటవీ అధికారులు పులులను గుర్తిస్తారు.
పులి తిరిగే ప్రాంతంలో మూత్రం, చెట్లపై గోకడం ద్వారా తమ గుర్తుల్ని విడిచిపెడతాయి. జింకలు, అడవిపందులు పశువులను ఆహారంగా తీసుకుంటాయి.అటవీశాఖ అధికారులు సీసీ కెమెరాల ద్వారా పులుల కదిలికల పర్యవేక్షిస్తారు. పగ్‌మార్క్ ట్రాకింగ్, డీఎన్‌ఏ నమూనాల ద్వారా పులుల సంఖ్యను లెక్కిస్తారు. దుధ్వా పులుల అభయారణ్యంలో తాజాగా ఆదివారం సఫారీ యాత్రలో ఉన్న పర్యాటకులు కొండచిలువను నోటకరుచుకొని పోతున్న పులిని దగ్గరగా చూసి షాకయ్యారు. ఏడు అడుగుల కొండచిలువ పులి కోరల నుంచి తప్పించుకునేందుకు విలవిలలాడింది. కొండచిలువ బరువును మోయలేక పులి అతికష్టమ్మీద నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. పర్యాటకులు తమ మొబైల్ కెమెరాలతో ఈ దృశ్యాన్ని చిత్రీకరించారు. పులి సాధారణంగా జింకలు, అడవి పందుల వంటి జంతువులను వేటాడుతుందని.. కొండచిలువను వేటాడటం అరుదని దుధ్వా పులుల అభయారణ్యం డిప్యూటీ డైరెక్టర్ ఆర్.జగదీశ్ తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం
ఇరాన్‌లో నిరసన కారులను అణచివేస్తున్న ప్రభుత్వం వీడియో
అమెరికా సెగతో ఇరాన్ లో అట్టుడికిన ఆందోళనలు! వీడియో
నా మనవడికి భోగి పళ్లు పోస్తున్నాం వీడియో
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
టైగర్ సఫారీలో జీప్‌లో పర్యాటకులు..కళ్ళెదుట ఆ సీన్ చూసి షాక్
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
