AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్ Vs చేప: ఆరోగ్యానికి ఏది బెస్ట్.. తినే ముందు తప్పక తెలుసుకోండి..

Chicken vs Fish: నాన్ వెజ్ ప్రియులకు చికెన్, చేపలు అంటే మస్త్ ఇష్టం. కొంతమందికి ముద్ద దిగదు. డైలీ వాటిని తినమన్న తింటారు. అయితే ఈ రెండింటిలో ఏది మీ ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పోషక విలువలు, జీర్ణమయ్యే శక్తి, ఆరోగ్య ప్రయోజనాల పరంగా ఈ రెండింటి మధ్య ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. వాటి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Dec 12, 2025 | 7:50 AM

Share
చికెన్ ప్రోటీన్‌కు నిలయం. కండరాల పెరుగుదలకు, బరువు నిర్వహణకు, ఫిట్‌నెస్‌కు ఇది చాలా అవసరం. ఇందులో విటమిన్లు B6, B12, జింక్, ఐరన్ కూడా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ చికెన్ తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.

1 / 5
 తక్కువ నూనె, తేలికపాటి మసాలాలతో వండిన చికెన్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉడికించిన, కాల్చిన లేదా సూప్ రూపంలో తీసుకుంటే చికెన్ చాలా పోషకమైనదిగా ఉంటుంది. అయితే వేయించిన లేదా అధిక మసాలాలు కలిపిన చికెన్ కేలరీలు, కొవ్వును పెంచుతుంది.

2 / 5
చేపలు అత్యంత ఆరోగ్యకరమైన మాంసాహార ఆహారాలలో ఒకటి. ఎందుకంటే ఇందులో అధిక ప్రోటీన్‌తో పాటు సహజంగా ఒమేగా-3 కొవ్వు ఉంటుంటి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి మెదడు ఎదుగుదలకు, జ్ఞాపకశక్తికి చాలా మంచివి. చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.

3 / 5
చికెన్ కంటే చేపలు త్వరగా జీర్ణమవుతాయి. అందుకే పిల్లలు, వృద్ధులు, అజీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇవి ఉత్తమమైనవి. చేపల్లో విటమిన్ డి, కాల్షియం ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేస్తాయి.

4 / 5
చికెన్, చేప రెండింటికీ వాటి స్వంత ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి కేవలం ఒకదానిపై ఆధారపడకుండా రెండింటినీ మీ ఆహారంలో సమతుల్యంగా చేర్చుకోవడం మంచిది. చేపలు ఒమేగా-3 వంటి ముఖ్యమైన పోషకాలను అందించి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కాబట్టి, కొన్ని సందర్భాల్లో చేపలను మరింత ప్రయోజనకరంగా ఉంటాయి.ఈ రెండు ఆహారాలు మీ ఆహారంలో విలువైన పోషకాలను అందిస్తాయి అనడంలో సందేహం లేదు.

5 / 5