రోజూ రాత్రి నిద్రకు ముందు కివి పండ్లు తినడం మరిచిపోవద్దు!
15 January 2026
TV9 Telugu
TV9 Telugu
కివి పండు చూడని వారుండరు. చూసేందుకు చిన్నగా ఉన్నప్పటికీ వీటిలో పోషకాలు దండిగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది
TV9 Telugu
వీటిలో విటమిన్ సితో పాటు విటమిన్ కె, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది
TV9 Telugu
బరువు కూడా అదుపులో ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది
TV9 Telugu
ముఖ్యంగా నిద్రలేమిని తగ్గించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. నిద్రించే ముందు కివి పండ్లను తీసుకోవడం వల్ల త్వరగా నిద్రపోవడంతో పాటు ఎక్కువసేపు నాణ్యమైన నిద్రను ప్రేరేపిస్తుంది
TV9 Telugu
నిజానికి, కివి పండులో సహజంగానే సెరొటోనిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది నిద్ర చక్రాన్ని నియంత్రించే ఒక రసాయనం. కివి పండును తీసుకోవడం వల్ల సెరొటోనిన్ ఉత్పత్తి ప్రోత్సహిస్తుంది
TV9 Telugu
దీంతో గాఢమైన నిద్రకు ఉపయోగపడుతుంది. నిద్రించే ముందు కివిపండును తినడం వల్ల త్వరగా నిద్ర వస్తుంది. అలాగే నిద్రించే సమయం కూడా పెరుగుతుంది
TV9 Telugu
అందుకే నిద్రలేమితో బాధపడే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కివి పండ్లల్లో విటమిన్ సి, ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి
TV9 Telugu
ఇవి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి మంట, వాపు వంటి వాటిని తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా కివి పండ్లను తీసుకోవడం వల్ల మెరుగైన నిద్ర సామర్థ్యాన్ని పొందగలుగుతాం