వంటల్లో వాడే రకరకాల పదార్థాల్లో వెల్లుల్లి పాత్ర అంతా ఇంతాకాదు. వంటల్లో వెల్లుల్లిని వాడడం వల్ల వంటలకు చక్కటి రుచి, సువాసనే కాదు ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది
TV9 Telugu
వెల్లుల్లిలో అల్లిసిన్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి
TV9 Telugu
దీనిలో శోథ నిరోధక లక్షణాలతో పాటు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. రోజూ వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది
TV9 Telugu
రోగనిరోధక శక్తి పెరగడం వల్ల జలుబు, ఫ్లూ వంటి ఇన్పెక్షన్ ల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. వెల్లుల్లి నైట్రిక్ యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. తద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది
TV9 Telugu
రక్తపోటు అదుపులో ఉండడం వల్ల గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి
TV9 Telugu
చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం వల్ల గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా వెల్లుల్లి మనకు దోహదపడుతుంది
TV9 Telugu
వెల్లుల్లిలో ఫ్లేవనాయిడ్స్, సెలీనియం వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నుండి కణాలను రక్షించి క్యాన్సర్, గుండె జబ్బులు, నాడీ సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుంది
TV9 Telugu
మహిళల్లో ఈస్ట్రోజన్ స్థాయిలను పెంచడంలో కూడా వెల్లుల్లి సహాయపడుతుంది. ఇది ఎముకల సాంద్రతను నిర్వహించడానికి సహాయపడుతుంది. వీరిలో వచ్చే ఎముకల పగుళ్లు, బోలు ఎముకల వంటి సమస్యలు రాకుండా నిరోధిస్తుంది