12 December 2025

నిశ్శబ్ద గుండెపోటు లక్షణాలు ఇవే.. లైట్ తీసుకుంటే రిస్క్‌లో పడ్డట్లే!

samatha

Pic credit - Instagram

ప్రస్తుతం చాలా మంది గుండె పోటు బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే గుండె ఆరోగ్యం విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అయితే ఈ మధ్య నిశ్శబ్ద గుండెపోటు ప్రమాదాలు పెరిగాయి.  నిశ్శబ్ద గుండె పోటు అంటే , సాధారణ గుండెపోటు లాగా కాకుండా, ఎక్కువ నొప్పి ఉండదు, దీంతో ప్రజలు గ్యాస్ స్ట్రిక్ అని అంతగా పట్టించుకోరు.

కానీ చివరకు ఇదే ప్రాణాల మీదకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం నిశ్శబ్ద గుండె పోటు అంటే ఏంటి? దీని లక్షణాలు ఏవో చూద్దాం.

నిశ్శబ్ద గుండెపోటు సమయంలో ఛాతిలో కొంచెం ఒత్తిడి, బరువు లేదా లాగడం, వంటి లక్షణాలు కనిపిస్తాయి. నొప్పి చాలా తక్కువగా ఉంటుంది.

శ్రమ లేదా వేడి లేకపోయిన చలిగా ఉన్న సమయంలో కూడా చలితో పాటు చెమటలు పట్టడం జరుగుతుంది. అలాగే కొన్ని సార్లు విపరీతమైన తల నొప్పి కూడా వస్తుంది.

అంతే కాకుండా తరచూ ఒత్తిడి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కొన్నిసార్లు శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కూడా నిశ్శబ్ద గుండె పోటు లక్షణాలు.

నిశ్శబ్దం గుండె పోటు సమయంలో కొన్నిసార్లు కారణం లేకుండానే తల తిరగడం, చికాకు, భయానకంగా అనిపించడం, ఇది గుండె లేదా రక్తప్రసరణ సమస్యలకు సంబంధించినదంట.

ఛాతి నొప్పి మాత్రమే కాదు కొన్ని సార్లు శరీరంలో ఇతర భాగాలలో ముఖ్యంగా నడుం నొప్పి,  కండరాలు, వెన్నుముక సమస్యలు కూడా తలెత్తుతుందంట.