చాణక్య నీతి : ఇలాంటి పురుషుడు ఇంట్లో ఉంటే కుటుంబం నాశనమే!
samatha
Pic credit - Instagram
ఆచార్య చాణక్యుడు తన కాలంలో అత్యంత జ్ఞాన వంతుడిగా ప్రసిద్ధి చెందాడు. ఈయన గొప్ప తత్వవేత్త, రాజకీయ నాయుడు. అత్యంత తెలివైన వ్యక్తి
చాణక్యుడు నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, నేటి సమాజానికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేయడం జరిగింది. అలాగే ఎన్నో విషయాల గురించి తెలియజేశాడు.
అయితే ఆయన కొంత మంది పురుషుల గురించి కూడా తన నీతి శాస్త్రం అనే పుస్తకంలో రచించారు, ఒక వ్యక్తి అలవాట్లు,ఇంటిని, కుటుంబాలను కూడా నాశనం చేస్తాయంట, అలాగే ఆ ఇంటి వారు కష్టాలను అనుభవిస్తారంట.
ఒక పురుషుడు పదే పదే భార్యను అగౌరవపరిస్తే, ఆమెను ఎప్పుడూ గౌరవించకపోయినా, ఇంటిలో ఆనందం, శ్రేయస్సు ఎప్పుడూ ఉండదంట, అతనితో జీవితం నరక యాతన కంటే ఎక్కువేనంట.
చాణక్య నీతి ప్రకారం, ఒక పురుషుడు పదే పదే ఇతర స్త్రీలను చూసే అలవాటు కలిగి ఉంటే, అతడు, తన సొంత ఇంటిని, కుటుంబాన్ని నాశనం చేసుకుంటారు. అలాంటి పురుషులు నాశనం అవుతారని చెబుతున్నాడు చాణక్యుడు.
అదే విధంగా చాణక్య నీతి ప్రకారం తన కుటుంబాలను పోషించుకోడానికి ఇతరుల నుంచి డబ్బులు అడగడం, ఎప్పుడూ ఇతరుల నుంచి డబ్బు అప్పు తీసుకునే వ్యక్తి ఎప్పుడూ తన కుటుంబం గురించి ఆలోచించడంట.
అదే విధంగా ఏ వ్యక్తి అయితే తన కుటుంబ బాధ్యతలను భారంగా భావిస్తాడో, ఏ పురుషుడు నిత్యం కుటుంబానికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాడో, అతని ఇంటిలోని వారు ఎప్పుడూ సంతోషంగా ఉండరంట.
అలాగే, కుటుంబ బాధ్యతలకు భయపడటం, అలాగే కుటుంబ బాధ్యత తీసుకోక పోయే వారి ఇల్లు సంపన్నంగా ఉండదు, అలాంటి పురుషులు సమాజంలో నిరంతరం అగౌరవం, అవమానాన్ని ఎదుర్కొంటారంట.