11 December 2025

వీకెండ్‌లో చిల్ అవ్వలా.. హైదరాబాద్‌లోని మోస్ట్ బ్యూటిపుల్ ప్లేసెస్ ఇవే!

samatha

Pic credit - Instagram

వీకెండ్ వస్తే చాలు, చాలా మంది జంటలు, ఫ్యామిలీస్ బయటకు వెళ్లి చిల్ అవ్వాలని అనుకుంటారు. అలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన సమాచారం.

హైదారాబాద్‌లో వీకెండ్ ఫుల్‌గా చిల్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా కొన్ని ప్లేసెస్ విజిట్ చేయాల్సిందేనంట. ఇంతకీ ఆ ప్రదేశాలు ఏవో చూసేద్దాం పదండి.

హైదరాబాద్‌లో అనేక చారిత్రక, సాంసృతిక ,ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన నగరం, ఇక్కడ ఎన్నోపురాతన కట్టడాలు ఉన్నాయి. అందులో చార్మినార్ కూడా ఒకటి.

చార్మినార్ వెళ్లి కుతుబ్ షాహీ రాజవంశం అద్భుత కట్టడాన్ని చూడటమే కాకుండా, లాల్ బజార్‌లో షాపింగ్, చార్మినార్‌లో గాజుల కొనుగోలు చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు.

అద్భుత కట్టడాల్లో గోల్కొండ కోట ఒకటి. దీనిని కాకతీయ రాజవంశీయులు అతి సుందరంగా నిర్మించారు. వీకెండ్ సమయంలో ఇక్కడికి వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు, లైటింగ్ షో అందరినీ ఆకట్టుకుంటుంది.

చౌమహల్లా ప్యాలస్, ఫ్రెంచ్ నిర్మాణంలో చాలా బాగుంటుంది. 18 శతాబ్ధంలో నిర్మించిన ఈ ప్యాలెస్‌లోకి వెళ్లి వీకెండ్ అక్కడ ఎంజాయ్ చేయవచ్చును.

మక్కా మసీద్ చార్మినార్ పక్కనే ఉంటుంది. ఇది దక్షిణ భారతదేశంలోనే అది పెద్ద మసీదుగా ప్రసిద్ధి, మక్కా నుంచి తెప్పించిన ఇసుకతో దీనిని నిర్మించినందుకు దీనికి మక్కా మసీదు అనే పేరు వచ్చింది. వీకెండ్ ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు.

హైదరాబాద్‌లో వీకెండ్‌కు అద్భుతమైన ప్రదేశాల్లో హుస్సెన్ సాగర్ బెస్ట్. ఇక్కడ లైటింగ్, బోటిగ్, యాచ్డ్ రైడింగ్ లాంటి వినోద కార్యకలాపాలు ఆకట్టుకుంటాయి.