ఉత్తర్ ప్రదేశ్ లోని అమరోహా జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న కొద్ది రోజుల పసికందు ఊపిరాడక మరణించింది. గతంలో శ్వాస సమస్యలు, కామెర్లతో బాధపడిన చిన్నారి పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.