- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips: These are the remedies to get rid of debt problems
వాస్తు టిప్స్ : అప్పుల బాధలు తగ్గిపోవాలా..ఇంట్లో ఈ మార్పులు చేయండి!
వాస్తు శాస్త్రం అనేది ఇంటి పురోగతి కోసం ఉపయోగపడుతుంది. అందుకే పండితులు తప్పకుండా ఇంటి విషయంలో వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు. కానీ కొంత మంది వాస్తు నియమాలు ఉల్లంఘించిన అనేక సమస్యల బారిన పడతారు. అది ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిపై దారుణ ప్రభావం చూపుతంది. ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.
Updated on: Dec 12, 2025 | 1:05 PM

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో లక్ష్మీదేవి కొలువుదీరి, ఆనందం, శ్రేయస్సు నెలకొని, సంపద పెరగాలి అంటే ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలి? ఇంటి లోపల ఏ దిశలో ఏ వస్తువులు ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం ప్రాకారం, తులసి చెట్టు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ప్రతి రోజూ తులసి మొక్కను పూజిస్తుంటారు. అయితే ఇంటికి అదృష్టాన్ని తీసుకొచ్చే తులసి మొక్క ఇంటికి ఈశాన్యం దిశలో నాటడం వలన ఆరోగ్యమే కాకుండా, సంపద కూడా పెరుగుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర పండితులు.

కలశం స్వచ్ఛతకు గుర్తు అందుకే. దీనిని ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో పెట్టడం చాలా మంచిదంట. దీని వలన జీవితంలోని ప్రతికూల శక్తి తొలిగిపోయి, సానుకూల శక్తి ప్రవేశిస్తుందంట. ఇది ఇంటి లోపల ఆనందం , సంపదకు కారణం అవుతుందంట.

సముద్రం నుంచి తీసిన పవిత్ర వస్తువు అయిన శంఖాన్ని లక్ష్మీదేవి చిహ్నంగా పరిగణిస్తారు. అయితే దీనిని కూడా పూజా సమయంలో ఊదడం సహజం, అయితే దీనిని లక్ష్మీదేవి విగ్రహానికి కుడివైపున పెట్టాలంట. అలాగే స్వస్తిక్, శుభం అనే చిహ్నాలు కూడా ఇంటికి లక్కును తీసుకొస్తాయి. కాబట్టి, వీటిని ఇంటి ప్రధాన ద్వారం వద్ద గీయడం చాలా మంచిది.

అలాగే ఇత్తడి, రాగి వంటి లోహాలు చాలా శక్తివంతమైనవి అందువలన వీటిని ఇంటి పూజ గదిలో ఈశాన్యం లేదా ఉత్తర దిశలో పెట్టడం చాలా మంచిది. ముఖ్యంగా ఇత్తడి గంటను ఉపయోగించి, ఉత్తర దిశలో పెట్టాలంట.



