2026లో ఈ రాశుల వారికి పెళ్లి అవ్వడం ఖాయం.. మీ రాశి ఉందా మరి!
2026వ సంవత్సరం రాబోతుంది. కొత్త ఏడాది ప్రారంభం కావడంతో చాలా మంది కొత్త కొత్త ఆలోచనలతో ఉంటారు. తమ జీవితంలోని కొన్ని ముఖ్యమైన కోరికలు నెరవేర్చుకోవాలి అనుకుంటారు. ఇక కొంత మంది కొత్త సంవత్సరంలో అయినా సరే తాము వివాహం చేసుకోవాలి అనుకుంటారు. అయితే ఈ సంవత్సరం కొన్ని రాశుల వారు వివాహం చేసుకోనున్నారంట. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Updated on: Dec 12, 2025 | 1:04 PM

2026 సంవత్సరం తమ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకరాబోతుందో అనే ఉత్సాహం చాలా మందిలో ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో చాలా గ్రహాలు తమ స్థానాలు మార్చుకోబోతున్నాయి. ముఖ్యంగా శుక్ర గ్రహం అనేక సార్లు తన స్థానాన్ని మార్చుకుంటాడంట. ఈ క్రమంలోనే తమ జాతకంలో గ్రహం బలంగా ఉండే ఈ రాశుల వారికి వివాహం జరగనున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

సింహ రాశి : సింహ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఫలమిస్తాయి. శుక్రుడు మీకు అండగా ఉండటంతో చాలా త్వరగా మీకు వివాహం జరిగే ఛాన్స్ ఉన్నదంట.

వృషభ రాశి : వృషభ రాశి వారికి 2026వ సంవత్సరంలో అద్భుతంగా ఉండబోతుంది. వీరి జాతకంలో మార్చిలో శుక్రుడు మేష రాశిలోకి సంచారం చేయడం వలన శుక్ర గ్రహం చాలా బలంగా ఉంటుంది. అందువలన వీరికి వివాహాది ప్రయత్నాలు త్వరగా ఫలిస్తాయి.

తుల రాశి : తుల రాశి వారికి 2026 సంవత్సరంలో లక్కు కలిసి వస్తుంది. ఈ రాశి వారు నూతన గృహ కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అదే విధంగా ఈ రాశి వారి ఏడవ ఇంటిలో శుక్రుడు సంచారం చేయడం వలన ఈ సంవత్సరంలో ఈ రాశి వారు తెలివైన భాగస్వామిని వివాహం చేసుకునే అవకాశం ఉంది.

మకర రాశి : మకర రాశి వారికి 2026లో అదృష్టం మారిపోతుంది. వీరు చాలా ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా ఎవరికి అయితే చాలా రోజుల నుంచి వివాహం నిశ్చయం కావడం లేదో వారికి అతి త్వరలో పెళ్లి ఫిక్స్ అయ్యి, వివాహం జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉన్నదంట.



