10 December 2025

ఉదయం Vs సాయంత్రం.. గ్రీన్ టీ ఎప్పుడు తాగడం మంచిదో తెలుసా?

samatha

Pic credit - Instagram

ఈ మధ్య చాలా మంది ఇష్టంగా ఎక్కువగా తాగే టీలలో గ్రీన్ టీ ముందుంటుంది. ఎందుకంటే దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ప్రతి రోజూ గ్రీన్ టీ తాగడం వలన ఇది బరువు తగ్గడం లేదా జీర్ణక్రియ ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది శరీరానికి చాలా మంచిది.

గ్రీన్ టీలో కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్స్, ఎల్ థియనిన్ అనే ఆమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉండటం వల ఇవి మీ జీర్ణక్రియపై శక్తిస్థాయిలపై ప్రభావం చూపుతాయి.

ప్రతి రోజూ గ్రీన్ టీ తాగడం వలన ఇది జీర్ణక్రియ మెరుగు పరిచి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.

గ్రీన్ టీలలో కెఫిన్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. అందువలన ఇద శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.

అయితే చాలా మందికి గ్రీన్ టీ, ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడు తాగడం మంచిది అనే డౌట్ ఉంటుంది. కాగా, ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం.

గ్రీన్ టీ ఉదయం తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. గ్రీన్ టీ ఉదయం తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇక కొంత మంది గ్రీన్ టీని సాయంత్రం సమయంలో తాగడానికి ఇష్టపడుతారు. కానీ గ్రీన్ టీ సాయంత్రం తాగడం వలన ఇది జీర్ణ సమస్యలకు కారణం అవుతుందంట.