అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. చింతూరు-మారేడుమిల్లి మార్గంలోని రాజుగారి మెట్ట వద్ద ప్రైవేట్ బస్సు అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో పది మంది ప్రయాణికులు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అరకు నుండి భద్రాచలం వెళుతుండగా తెల్లవారుజామున 3:30 నుండి 4:00 గంటల మధ్య ఈ ప్రమాదం సంభవించింది.