ఒక స్పానిష్ కంపెనీలో పనిచేస్తున్న 22 ఏళ్ల యువతి రెండేళ్లపాటు ప్రతిరోజూ 40 నిమిషాలు ముందుగా ఆఫీస్కు రావడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. మేనేజ్మెంట్ హెచ్చరికలను పట్టించుకోకపోవడం, ముందుగా వచ్చినప్పుడు పని లేకపోవడం వంటి కారణాలతో కోర్టు ఆమె కేసును కొట్టివేసింది. సమయపాలన నియమాల ఉల్లంఘన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది.