- Telugu News Photo Gallery Why You Should Drink Jaggery Water Daily, The Natural Detox Drink for Liver Health and Blood Purification
Jaggery Water: ప్రతిరోజూ బెల్లం నీళ్లు తాగితే మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే.. కేవలం 7 రోజుల్లోనే..
బెల్లం రుచికరమైన స్వీటెనర్ మాత్రమే కాదు.. ఇది పోషకాల నిధి. చెరకు రసం నుండి తయారయ్యే బెల్లంలో అనేక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు నిజాలు ఉంటాయి. దీని సహజమైన తీపి చక్కెర కంటే చాలా ఆరోగ్యకరమైనది. అందుకే చాలా మంది భోజనం తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క తినడానికి ఇష్టపడతారు. అయితే కొన్ని రోజులు ప్రతి ఉదయం బెల్లం నీటిని తాగితే మీ శరీరంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Dec 11, 2025 | 8:26 AM

శరీరం డీటాక్స్: బెల్లం నీరు ఒక సహజమైన డీటాక్ డ్రింక్. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విషాన్ని సమర్థవంతంగా బయటకు పంపి, కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఇది రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది. బెల్లం నీటిని కేవలం 7 రోజులు తాగడం ద్వారా రక్త శుద్ధిలో ఫలితాలు కనిపించడం మొదలవుతాయి.

చర్మ సమస్యలు: బెల్లం కేవలం అంతర్గత ఆరోగ్యానికి మాత్రమే కాక చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా గోరువెచ్చని నీటితో కలిపి తాగడం వల్ల మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆయుర్వేదంలో కూడా వేడి నీరు, బెల్లం మిశ్రమం చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

లివర్ హెల్త్: బెల్లంలో లభించే ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడతాయి. బెల్లం నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కాలేయం శుభ్రపడటంతో పాటు కొవ్వు కాలేయ సమస్యలు వంటి వాటిని నయం చేయడంలో కూడా సహాయపడుతుంది.

పీరియడ్స్ నొప్పి: మహిళలకు బెల్లం నీరు ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. బెల్లం కషాయంలో ఉండే మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు.. పీరియడ్స్ సమయంలో సంభవించే కడుపు నొప్పి, బలహీనత, మానసిక స్థితిలో మార్పులను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ సమయంలో మహిళలు బెల్లం నీటిని లేదా బెల్లం కషాయాన్ని తాగడం చాలా మంచిది.

జీర్ణవ్యవస్థ: ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో బెల్లం కలిపి తాగడం జీర్ణక్రియకు అత్యంత ప్రయోజనకరం. ఇది జీర్ణక్రియ సరిగ్గా జరిగేలా చూస్తుంది. కడుపులో గ్యాస్, ఆమ్లత్వం, మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. బెల్లంలో ఉండే ఫైబర్ పేగులను శుభ్రపరుస్తుంది. ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది.




