- Telugu News Photo Gallery Cinema photos Tamannaah kiara shraddha kapoor show interest in biopic films
వింటేజ్ లుక్స్‌లో అదరహో.. బయోపిక్‌లపై ఇంట్రస్ట్ చూపుతున్న గ్లామర్ బ్యూటీస్
అందాల ముద్దుగుమ్మలు ప్రస్తుతం బయోపిక్‌లపై ఇంట్రస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు, గ్లామర్ రోల్స్‌లో కనిపిస్తూ సందడిచేసే బ్యూటస్ ఇప్పుడు ఎక్కువగా వింటేజ్ లుక్ పైనే మక్కువ కనబరుస్తున్నారు. కాగా, అసలు ఏ హీరోయిన్స్, ఏ ఏ బయోపిక్‌లతో తమ అభిమానుల ముందుకు రానున్నారు అనే విషయాలను తెలుసుకుందాం.
Updated on: Dec 11, 2025 | 10:11 AM

అందాల ముద్దుగుమ్మలు ప్రస్తుతం బయోపిక్‌లపై ఇంట్రస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు, గ్లామర్ రోల్స్‌లో కనిపిస్తూ సందడిచేసే బ్యూటస్ ఇప్పుడు ఎక్కువగా వింటేజ్ లుక్ పైనే మక్కువ కనబరుస్తున్నారు. కాగా, అసలు ఏ హీరోయిన్స్, ఏ ఏ బయోపిక్‌లతో తమ అభిమానుల ముందుకు రానున్నారు అనే విషయాలను తెలుసుకుందాం.

ఎప్పుడు గ్లామర్ రోల్స్‌లో కనిపించే అందాలు భామలు సడన్‌గా వింటేజ్ టచ్ ఇస్తే. త్వరలో అలాంటి కిక్కునే ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు మూవీ లవర్స్. ఈ మధ్య గ్లామర్ రోల్స్‌లో అదరగొట్టిన అందాల భామలు ఇప్పుడు బయోపిక్స్‌తో అభిమానులు ఊరిస్తున్నారు. ఎవరా బ్యూటీస్.. ఏంటి మూవీస్ హ్యావ్ ఏ లుక్.

లీడ్ క్యారెక్టర్స్ కన్నా స్పెషల్ సాంగ్స్‌లోనే ఎక్కువగా కనిపిస్తున్న తమన్నా... ఓ ప్రస్టీజియస్ మూవీలో కీ రోల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లెజెండరీ బాలీవుడ్ దర్శకుడు వీ శాంతారామ్ బయోపిక్‌లో ఇంపార్టెంట్ రోల్‌లో నటిస్తున్నారు. అలనాటి అందాల నటి జయశ్రీగా ఆమె తెర మీద కనిపించబోతున్నారు.

క్రేజీ బ్యూటీ కియారా కూడా ఇంట్రస్టింగ్ బయోపిక్‌కు సిద్ధమవుతున్నారు. ప్రజెంట్ మెటర్నిటీ బ్రేక్‌లో ఉన్న ఈ బ్యూటీ త్వరలో కెమెగా ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. లెజెండరీ హీరోయిన్ మీనా కుమారి బయోపిక్‌లో టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు కియారా.

మరో నార్త్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కూడా బయోపిక్ మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నారు. మరాఠి కళాకారిణి విఠాబాయి పాత్రలో నటించేందుకు ట్రైనింగ్ తీసుకుంటున్నారు శ్రద్ధా. గ్లామరస్ హీరోయిన్స్ అంతా ఒకేసారి వింటేజ్ టర్న్ తీసుకోవటం ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది.