- Telugu News Photo Gallery Cinema photos Do you know who this star heroine is living in a rented house, She is Adah Sharma
Tollywood : ఇండస్ట్రీలో తోప్ హీరోయిన్ కానీ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే.. ఆమె ఎవరంటే..
చాలా మంది హీరోయిన్స్ ఈ మధ్య ఒక ఒక్క సినిమాతో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. ఓవర్ నైట్‌లో స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు. మరికొంతమంది ప్రయత్నిస్తూ.. ఎదో ఒకసినిమాతో సక్సెస్ అవుతున్నారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా అంతే.. వరుసగా సినిమాలు చేస్తూ.. మొన్నీమధ్యనే భారీ హిట్ అందుకుంది.
Updated on: Dec 11, 2025 | 2:01 PM

చాలా మంది హీరోయిన్స్ ఈ మధ్య ఒక ఒక్క సినిమాతో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. ఓవర్ నైట్‌లో స్టార్ డమ్ సొంతం చేసుకుంటున్నారు. మరికొంతమంది ప్రయత్నిస్తూ.. ఎదో ఒకసినిమాతో సక్సెస్ అవుతున్నారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా అంతే.. వరుసగా సినిమాలు చేస్తూ.. మొన్నీమధ్యనే భారీ హిట్ అందుకుంది.

ఈ అమ్మడు నటించిన సినిమా ఏకంగా రూ. 400కోట్లకు పైగా వసూల్ చేసింది. నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఆ హీరోయిన్. ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టారా.? భారీ హిట్ అందుకున్నప్పటికీ ఇప్పటికి అద్దె ఇంట్లోనే ఉంటుంది ఆమె. ఇంతకు ఆ టాలెంటెడ్ హీరోయిన్ ఎవరో కనిపెట్టరా.? నటన పరంగానే కాదు అందంతోనూ ఆకట్టుకుంది. గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకుంది. ఇంతకూ ఆమె ఎవరంటే..

పై ఫొటోలో కనిపిస్తున్న అందాల భామ ఎవరో కాదు.. హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అదా శర్మ. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఆ తర్వాత ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా ఒకటి రెండు సినిమాలు చేసింది.ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ లేడీ ఓరియేంటేడ్ మూవీస్ చేస్తోంది అదా శర్మ. అక్కడ కూడా వరుసగా అవకాశాలు అందుకుంటుంది. ఇక అదా శర్మ నటించిన ది కేరళ స్టోరీ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఏకంగా రూ. 400కోట్లు వసూల్ చేసింది.

అయితే అదా శర్మ మొన్నామధ్య దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇంట్లోకి దిగింది. ఎక్కడైతే సుశాంత్ సూసైడ్ చేసుకొని చనిపోయాడో అదే ఫ్లాట్ లో ఆమె అద్దెకు దిగింది. నెలనెలా రెంట్ పే చేస్తుంది అదా శర్మ. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది




