"ఎగ్గోస్" కంపెనీ సరఫరా చేసే గుడ్లలో ప్రపంచవ్యాప్తంగా నిషేధించిన నైట్రోఫురాన్, నైట్రోఇమిడజోల్ వంటి యాంటీబయాటిక్స్ ఉన్నాయని ల్యాబ్ నివేదిక పేర్కొంది. ఈ పదార్థాలు డీఎన్ఏను దెబ్బతీసి క్యాన్సర్కు కారణమయ్యే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. కాగా, ఈ ఆరోపణలను ఎగ్గోస్ కంపెనీ తోసిపుచ్చింది.