- Telugu News Photo Gallery Business photos Gold price increases by Rs. 2000 and silver price by Rs. 3000, check updated Gold and silver rate in Hyderabad, Vijayawada
Gold Price Update: దిమ్మదిరిగే షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు!
Gold Price Update: భారతీయ సంస్కృతిలో బంగారానికి ఉన్న ప్రత్యేక ప్రాధాన్యత ఏంటో మనందరికి తెలిసిందే. వివాహాలు, ఉత్సవాల సమయంలో తప్పనిసరి కొనుగోళ్ల కారణంగా ధరల పెరుగుదల ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తోంది. తాజాగా పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. అంతా..
Updated on: Dec 12, 2025 | 9:51 AM

Gold Price Update: పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. అంతా ఊహించినట్లుగానే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను మరోసారి తగ్గించడంతో బంగారం ధర భారీగా పెరుగుతోంది.

దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు ఊగిసలాటలకు గురవుతూ సాధారణ వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. స్వల్ప తగ్గుదల, తదుపరి రోజునే మళ్లీ భారీగా పెరుగుతున్న ధరలు సామాన్య కుటుంబాలకి బంగారాన్ని మరింత దూరంలోకి నెట్టేస్తున్నాయి.

ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో బంగారానికి ఉన్న ప్రత్యేక ప్రాధాన్యత ఏంటో మనందరికి తెలిసిందే. వివాహాలు, ఉత్సవాల సమయంలో తప్పనిసరి కొనుగోళ్ల కారణంగా ధరల పెరుగుదల ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తోంది.

డిసెంబర్ 12 ఉదయం నమోదైన బులియన్ ధరలు పీక్స్‌కి చేరాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 1910 రూపాయలు పెరిగింది. అంటే దాదాపు 2 వేల రూపాయల వరకు ఎగబాకింది. దీంతో 24 క్యారెట్ల ధర రూ.1,32,660కి చేరుకుంది. అదే 22 క్యారెట్ల పది గ్రాములపై రూ.1750 పెరిగి ప్రస్తుతం రూ.1,21,600 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో తులం బంగారం ధర రూ.1,32,600 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి విషయానికొస్తే కిలో వెండిపై కూడా భారీగా పెరిగింది. దీనిపై 3 వేల వరకు ఎగబాకింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,04000 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్, చెన్నై, కేరళలో మాత్రం ఇంకా భారీగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.2,15,000 వద్ద ఉంది.




