అధిక బరువు సమస్య ప్రస్తుతం చాలా మందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. వేళకు భోజనం చేయకపోవడం, ఆలస్యంగా నిద్రించడం, జంక్ ఫడ్‌ను అధికంగా తినడం, మద్యం ఇలా అనేక కారణాల బరువు పెరుగుతున్నారు
TV9 Telugu
అయితే బరువు తగ్గేందుకు చాలా మంది అనేక రకాల డైట్‌లను పాటిస్తుంటారు. ఈ క్రమంలోనే అన్నం తినడం పూర్తిగా మానేస్తే బరువు సులువుగా తగ్గొచ్చని అధిక మంది భావిస్తుంటారు
TV9 Telugu
నిజానికి అధిక బరువును తగ్గించుకోవాలంటే సరైన డైట్ పాటించాలి. కానీ అన్నం తినడం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అన్నం తింటూ కూడా బరువును తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు
TV9 Telugu
అన్నాన్ని రోజూ కొద్ది కొద్దిగా తినవచ్చు. అన్నం అంటే పూర్తిగా పాలిష్ చేయని బ్రౌన్ రైస్ వండుకుని తినాలి. ఇందులో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి
TV9 Telugu
అవి మన శరీరంలో అధికంగా చేరితే కొవ్వు కింద మారుతాయి. దీంతో బరువు పెరుగుతారు. అయితే ఇలా జరిగే మాట వాస్తవమే. కానీ అంత మాత్రాన అన్నం తినడాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు
TV9 Telugu
కప్పు అన్నం తింటే సుమారుగా 40 గ్రాముల పిండి పదార్థాలు లభిస్తాయి. కనుక పూటకు ఒక కప్పు అన్నం అయితే మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలూ కలిపి మొత్తం రెండు కప్పుల అన్నం తినవచ్చు
TV9 Telugu
దీంతో 80 గ్రాముల పిండి పదార్థాలు లభిస్తాయి. ఇవి మనకు రోజుకు సరిపోతాయి. ఇలా అన్నాన్ని తినాల్సి ఉంటుంది. దీని వల్ల బరువు తగ్గడం కూడా తేలికవుతుంది
TV9 Telugu
అయితే చాలా మంది అన్నాన్ని మరీ అతిగా తింటారు. ఎంత తింటున్నారో వారికేతెలియదు. అలాంటి వారు అన్నం తినడాన్ని పూర్తిగా మానేయడమే మంచిది. బదులుగా పుల్కాలను తినవచ్చు. ఇలా చేస్తే బరువు తగ్గొచ్చు