Plastic Bottle: ప్లాస్టిక్ బాటిల్స్‌, గ్లాసుల్లో నీళ్లు తాగుతున్నారా? తస్మాత్‌ జాగ్రత్త.. ఈ సమస్యలు రావొచ్చు

ప్లాస్లిక్‌ బాటిల్స్‌లో, గ్లాసుల్లో నీటిని తాగడం ఆరోగ్యానికి అంత మంచిదికాదంటున్నారు నిపుణులు. ప్లాస్టిక్ ఒక పాలిమర్. ఇందులో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, క్లోరైడ్ ఉంటాయి.

Plastic Bottle: ప్లాస్టిక్ బాటిల్స్‌, గ్లాసుల్లో నీళ్లు తాగుతున్నారా? తస్మాత్‌ జాగ్రత్త.. ఈ సమస్యలు రావొచ్చు
Water
Follow us
Basha Shek

|

Updated on: Oct 01, 2022 | 9:49 AM

మనం ఆఫీసుకు లేదా బయటకు వెళ్లినప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీటిని తీసుకువెళతాం. అలాగే చాలామంది జిమ్‌లు, వర్కవుట్లకు వెళ్లేటప్పుడు కూడా ప్లాస్టిక్‌ వాటిర్‌ బాటిల్స్‌నే ఉపయోగిస్తారు. అదేవిధంగా చాలా చోట్ల తాగునీటికి ప్లాస్టిక్‌ గ్లాసులే వినియోగిస్తున్నారు. అయితే ఇలా ప్లాస్లిక్‌ బాటిల్స్‌లో, గ్లాసుల్లో నీటిని తాగడం ఆరోగ్యానికి అంత మంచిదికాదంటున్నారు నిపుణులు. ప్లాస్టిక్ ఒక పాలిమర్. ఇందులో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, క్లోరైడ్ ఉంటాయి. ఇవి కాకుండా ప్లాస్టిక్‌లో బీపీ అనే రసాయనం ఉంటుంది. ఇది మన శరీరానికి చాలా హానికరం. వైద్య నిపుణుల ప్రకారం ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో ఉండే రసాయనాలు, పాలిమర్లలో ఉండే మూలకాలు మన శరీరంలోకి వెళితే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట.

క్యాన్సర్ ముప్పు..

ప్లాస్టిక్ బాటిల్స్‌ లో నీటిని తాగితే చాలా తీవ్రమైన వ్యాధులను కలుగుతాయి. ముఖ్యంగా పురుషులలో హార్మోన్ల సమస్యలకు దారి తీస్తాయట. స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడంతో పాటు కాలేయానికి తీవ్రమైన నష్టం కూడా కలుగుతుంది. ఇక మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

రాగి పాత్రలు ఉపయోగించండి..

మన ఇళ్లలో కూడా చాలామంది ప్లాస్టిక్ బాటిళ్లలో ఉంచిన నీటిని తాగుతారు. అంతేకాదు నీటితో నింపిన ప్లాస్టిక్ బాటిళ్లను రోజుల తరబడి ఫ్రిజ్‌లో ఉంచుతుంటారు. ఇలా చేయడం వల్ల ప్లాస్టిక్ బాటిల్‌లో ఉన్న DPA, ఇతర రసాయనాలు మన శరీరంలోకి చేరుతాయి. తీవ్ర ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయి. వీటికి ప్రత్యామ్నాయంగా రాగి పాత్రలు వాడితే మంచిది. పురాతన కాలంలో కూడా ప్రజలు రాగి పాత్రలను మాత్రమే ఉపయోగించారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం, రాగిలో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ప్రభుత్వ లెక్కల ప్రకారం, భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 3.5 మిలియన్ టన్నుల ప్లాస్టిక్‌ను ఉత్పత్తి అవుతోంది. వచ్చే ఐదేళ్లలో తలసరి పరంగా ఇది మరింత రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే