Weight Loss: ఏ కలర్ ప్లేట్ లో భోజనం చేస్తున్నారు.. ఫుడ్ డైట్ లో ఇదీ ముఖ్యమే.. అంతే కాకుండా
ప్రస్తుత కాలంలో బరువు పెరిగిపోవడం సాధారణ సమస్యగా మారిపోయింది. కానీ ఇది అందరినీ తీవ్రంగా వేధిస్తోంది. బరువు పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. క్యాన్సర్, డయాబెటిస్, గుండె సమస్యలు వచ్చే..
ప్రస్తుత కాలంలో బరువు పెరిగిపోవడం సాధారణ సమస్యగా మారిపోయింది. కానీ ఇది అందరినీ తీవ్రంగా వేధిస్తోంది. బరువు పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. క్యాన్సర్, డయాబెటిస్, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వెయిట్ తగ్గేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. బరువు పెరిగినంత సులభంగా తగ్గలేం. అందుకు చాలా కష్టపడాలి. జిమ్ లో కసరత్తులు చేయాలి. ఫుడ్ డైట్ పాటించాలి. అయితే కష్టపడాల్సిన పని లేకుండా సులభంగా బరువు తగ్గేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని పాటిస్తూ చక్కగా స్లిమ్ అవ్వొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నీరు తాగితే బరువు తగ్గే అవకాశం ఉంది. నీరు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు, జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో రెండు గ్లాసుల నిమ్మరసం తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం చేసే ముందు ఒక గ్లాస్ నీరు తాగాలి. ఇలా చేయడం వల్ల తక్కువగా ఆహారం తీసుకుంటారు. దీంతో జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవడంతో పాటు, శరీరానికి కావాల్సిన పోషకాలు, మినరల్స్ చక్కగా అందుతాయి.
ఇప్పుడు చెప్పబోయేది కాస్త ఫన్నీగా అనిపించినా అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. భోజనానికి ముందు అరటిపండు, యాపిల్ వాసన చూస్తే ఆకలి తగ్గుతుంది. డిన్నర్ చేసే ముందు రూమ్‌లో వెనీలా క్యాండిల్ వెలిగించాలి. ఇది బ్రెయిన్‌లో కెమికల్ రియాక్షన్స్‌ను యాక్టీవ్ చేస్తుంది. ముఖ్యంగా భోజనం చేసే ముందు ప్లేట్‌లోని ఆహారాన్ని ఫోటో తీయాలి. చాలా మంది తమ ఆహారాన్ని ఫోటోలో చూసిన తర్వాత తక్కువ తింటారని ఓ అధ్యయనంలో తేలింది. బ్లూ ప్లేట్‌లో తినే అలవాటు ఉన్నా, గోడలకు బ్లూ కలర్ ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా త్వరగా బరువు తగ్గుతారని టుడే.కామ్ నివేదికలో వెల్లడైంది. బ్లూ కలర్ ను ఆకలిని తగ్గిస్తుందని తెలిపింది.
కొంతమంది ఆహారాన్ని సరిగ్గా నమలకుండా మింగేస్తారు. ఇది ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. ఆహారం పూర్తిగా నమిలి తింటే బరువు తగ్గడం తేలకవుతుంది. ఆహారం పూర్తిగా నమిలితే కడుపు నిండిన భావన కలుగుతుంది. గబగబా తినేయకుండా భోజనం చేయడానికి కనీసం 20 నిమిషాలు సమయం కేటాయించాలి.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి