Weight Loss: పొట్ట బాగా పెరుగుతుందా..? భోజనం తర్వాత 10 నిమిషాలు ఇలా చేస్తే.. ఊబకాయం హాంఫట్..

ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా.. పెరుగుతున్న ఊబకాయం చాలామందికి పెద్ద సమస్యగా మారుతోంది. దీనివల్ల ప్రజల్లో ఆస్తమా, మధుమేహం, షుగర్, గుండెపోటు వంటి వ్యాధులు కూడా పెరుగుతున్నాయి.

Weight Loss: పొట్ట బాగా పెరుగుతుందా..? భోజనం తర్వాత 10 నిమిషాలు ఇలా చేస్తే.. ఊబకాయం హాంఫట్..
Weight Loss Tips
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 01, 2022 | 9:38 AM

ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా.. పెరుగుతున్న ఊబకాయం చాలామందికి పెద్ద సమస్యగా మారుతోంది. దీనివల్ల ప్రజల్లో ఆస్తమా, మధుమేహం, షుగర్, గుండెపోటు వంటి వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. శరీర బరువు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఒక ప్రధాన కారణం ఏమిటంటే రాత్రి ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోవడం లేదా తగినంత శారీరక శ్రమ లేకపోవడం. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే కొన్ని ప్రత్యేకమైన, సులభమైన మార్గాలను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారం తీసుకున్న తర్వాత ప్రతిరోజూ 10-15 నిమిషాల పాటు బరువు తగ్గించే ఈ చిట్కాలను పాటించడం ద్వారా కొద్ది రోజుల్లోనే మీ శరీరాన్ని సరైన ఆకృతికి తీసుకురావచ్చు. ఆ ప్రత్యేక చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

తిన్న తర్వాత నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు..

రోజూ తిన్న తర్వాత 10-15 నిమిషాలు నడవడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ మెటబాలిజం బూస్ట్ అవుతుంది. దీని వల్ల పెరిగిన శరీర బరువు సులభంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇలా ప్రతిరోజూ చేయడం ద్వారా ఊబకాయం ప్రమాదాన్ని కూడా చాలా వరకు నివారించవచ్చు.

ఇవి కూడా చదవండి

తిన్న తర్వాత నడవడం వల్ల శరీరంలోని జీర్ణవ్యవస్థ సంపూర్ణంగా ఫిట్‌గా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. నడక ద్వారా కడుపులోని అంతర్గత వాపు తగ్గుతుంది. కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

శరీరం నుంచి టాక్సిన్స్ దూరం..

భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం వల్ల శరీరంలోని అనవసరమైన టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. నడక కారణంగా శరీరం కదలి.. అంతర్గత వ్యవస్థ ఫిట్‌గా ఉంచుతుంది.

నిలబడినా మంచిదే.. 

మీకు నడవడానికి చుట్టుపక్కల స్థలం లేకుంటే లేదా దీనికి తగినంత సమయం దొరకకపోతే.. మరొక ఎంపిక కూడా ఉంది. ఆహారం తిన్న తర్వాత ప్రతిరోజూ దాదాపు 15-20 నిమిషాలు నిలబడటం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల అదనపు కేలరీలు కరిగిపోతాయి. పెరిగిన కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల కూర్చోవడం వల్ల కలిగే అలసట కూడా దూరమవుతుంది.

భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదనే సలహా వెనుక కారణం ఏమిటంటే.. భోజనం తర్వాత శరీరంలో రక్తం పరిమాణం పెరుగుతుంది. దీనిలో శరీరం తేలికగా కదలాలి. తద్వారా ఆ రక్తం శరీరంలో తగినంత పరిమాణంలో ప్రవహిస్తుంది. మనం ఇలా చేయకపోతే శరీరంలో తగినంత రక్త ప్రసరణ లేకపోవడం వల్ల నీరసంగా, బలహీనంగా మారుతుంది.

భోజనం చేసిన వెంటనే నిద్రపోవొద్దు..

మీరు భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు. ఇలా చేయడం వల్ల శరీరంలోని జీర్ణకోశం మందగిస్తుంది. దీని వల్ల మీరు తిన్న ఆహారం సులభంగా జీర్ణం కాదు. దీంతో అజీర్ణం, పొట్టలో గ్యాస్ సమస్య వస్తుంది.

ఆహారం జీర్ణం కాదు..

మనం ప్రతిరోజూ భోజనం చేసిన వెంటనే నిద్రలోకి జారుకుంటే మన శరీరం గ్యాస్ట్రిక్ యాసిడ్ రిఫ్లక్స్ , గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా కడుపులో తిమ్మిరి, నొప్పి, మలబద్ధకం, అజీర్ణం సమస్య నిరంతరం మొదలవుతుంది. దీనికి కారణం మన కడుపులోని ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడమే. దాని వల్ల ప్రయోజనానికి బదులుగా హాని చేయడం ప్రారంభిస్తుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో