AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Diet: డయాబెటిస్ బాధితులకు వరం ఉల్లిపాయ.. తాజా పరిశోధనలో సంచలన విషయాలు.. పూర్తి వివరాలు..

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 422 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 1.5 మిలియన్ మరణాలు సంభవిస్తున్నాయి.

Diabetes Diet: డయాబెటిస్ బాధితులకు వరం ఉల్లిపాయ.. తాజా పరిశోధనలో సంచలన విషయాలు.. పూర్తి వివరాలు..
Onion
Shaik Madar Saheb
|

Updated on: Oct 01, 2022 | 8:38 AM

Share

ప్రపంచ వ్యాప్తంగా మధుమేహం బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆరోగ్య సమస్యలలో ఇది ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 422 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 1.5 మిలియన్ మరణాలు సంభవిస్తున్నాయి. ఇది ముఖ్యంగా అనారోగ్యకరమైన జీవనశైలి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగినప్పుడు సంభవిస్తుంది. మధుమేహాన్ని పూర్తిగా నయం చేయలేమని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల, మన శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలి మన రక్తంలో చక్కెరను తనిఖీ చేయడానికి, అదుపులో ఉంచడానికి ఉత్తమ మార్గంగా పేర్కొంటున్నారు.

ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వచించడంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మన వంటగదిలో సాధారణంగా అందుబాటులో ఉండే అనేక రకాల ఆహార పదార్థాలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి మధుమేహాన్ని నిర్వహించడానికి అవసరమైన పోషకాలను మీకు అందిస్తుంది. అలాటి ముఖ్యమైన ఆహార పదార్ధాలలో ఉల్లిపాయ ఒకటి.. మీరు చదివింది నిజమే.. శాన్ డియాగోలో జరిగిన ఎండోక్రైన్ సొసైటీ 97వ వార్షిక సమావేశంలో సమర్పించిన అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రక్తంలో చక్కెర స్థాయిలను 50 శాతం తగ్గించడంలో సహాయపడే లక్షణాలు ఉల్లిపాయలో ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. అంతే కాదు. కొలెస్ట్రాల్‌ను నిర్వహించడానికి ఇది గొప్పదని కూడా నిరూపితమైంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. “ఉల్లిపాయ బల్బ్, అల్లియం సెపా, యాంటీడయాబెటిక్ డ్రగ్ మెట్‌ఫార్మిన్‌తో ఇచ్చినప్పుడు డయాబెటిక్ ఎలుకలలో.. రక్తంలో అధిక గ్లూకోజ్ (చక్కెర), మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను బాగా తగ్గించింది.”

పరిశోధకులు మూడు రకాల ఎలుకల సమూహాల (మధుమేహంతో) పై అధ్యయనం నిర్వహించారు. వాటికి ఉల్లిపాయ సారాన్ని మూడు వేర్వేరు మోతాదులను ఇచ్చారు. వీటికి సరి పోల్చడానికి సాధారణ రక్త చక్కెరతో నాన్‌డయాబెటిక్ ఎలుకల మూడు ఇతర సమూహాలను ఉపయోగించారు. దీనిద్వారా డయాబెటిక్ ఎలుకలలో రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా తగ్గించడంతోపాటు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతున్నట్లు కనుగొన్నారు. “ఉల్లిపాయలో కేలరీలు ఎక్కువగా ఉండవు” అని పరిశోధకులు తెలిపారు. అయినప్పటికీ, ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. దానితోపాటు ఆకలిని పెంచడం, దాణా పెరుగుదలకు దారితీసిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఉల్లి రక్తంలో గ్లూకోజ్ తగ్గింపుకు దారితీసిన పరిస్థితులు, అధ్యయనాన్ని తాము పరిశోధించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి మీ రోజువారీ ఆహారంలో ఉల్లిపాయను చేర్చుకోవాలని తాము సూచిస్తున్నామన్నారు. అయితే, ఏదైనా జీవనశైలి మార్పునకు అనుగుణంగా ఉండే ముందు ఎల్లప్పుడూ నిపుణులను సంప్రదించాలని పేర్కొన్నారు.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి