Diabetic Patients: డయాబెటిక్ పేషెంట్లకు అలెర్ట్.. వేసవిలో ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే ముప్పు తప్పదు
ఇక వేసవి విషయానికొస్తే.. హీట్ ఎగ్జాషన్ కారణంగా త్వరగా హీట్ స్ట్రోక్‌కు గురవుతారు డయాబెటిక్ పేషెంట్లు. ఇది వారి ఆరోగ్యంమీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి ఇది హీట్ ఎగ్జాషన్ లేదా హీట్ స్ట్రోక్ వంటి మెడికల్ ఎమర్జెన్సీలకు దారి తీస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతి సీజన్‌లో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు . వాతావరణంలోని మార్పులే ఇందుకు ప్రధాన కారణం. ఇక వేసవి విషయానికొస్తే.. హీట్ ఎగ్జాషన్ కారణంగా త్వరగా హీట్ స్ట్రోక్‌కు గురవుతారు డయాబెటిక్ పేషెంట్లు. ఇది వారి ఆరోగ్యంమీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి ఇది హీట్ ఎగ్జాషన్ లేదా హీట్ స్ట్రోక్ వంటి మెడికల్ ఎమర్జెన్సీలకు దారి తీస్తుంది. వేసవి వేడి కారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది అధిక మూత్రవిసర్జనకు దారితీస్తుంది. దీంతో డీహైడ్రేషన్ స్థాయులను పెంచుతుంది. డైయూరిటిక్స్ వంటి డయాబెటిస్ మందులు కూడా మిమ్మల్ని డీహైడ్రేషన్‌గా భావించేలా చేస్తాయి. కాబట్టి మధుమేహం ఉన్న వ్యక్తికి వేసవిలో ఎక్కువ ఆరోగ్య సంరక్షణ అవసరం. వేడిమి రక్తంలో చక్కెర నియంత్రణను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నిర్వహించడానికి కష్టపడే ఇన్సులిన్‌ను ఉపయోగించే వారికి. అదనంగా, అధిక ఉష్ణోగ్రతల వల్ల ఏర్పడే నిర్జలీకరణం చక్కెర స్థాయిలలో అసమతుల్యతకు దారి తీస్తుంది. అలాగే హీట్ ఎగ్జాషన్ హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని మెయింటైన్ చేయడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.
నీరు బాగా తాగాలి.. రోజంతా నీరు పుష్కలంగా తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్ చేయడం చాలా ముఖ్యం. రోజుకు కనీసం రెండు లీటర్ల నీరు తాగాలి. దీనివల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా నిరోధించవచ్చు. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకుని వెళ్లడం మంచిది. బయట శీతల పానీయాలకు దూరంగా ఉండడం ఉత్తమం
వడదెబ్బ ముప్పు.. వేసవి కాలంలో రక్తంలో చక్కెర స్థాయిని క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఇది వేసవిలో తలెత్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. ఇన్సులిన్ స్థాయిలను తరచూ చెక్ చేసుకోవాలి. వైద్యుడిని సంప్రదించడం ద్వారా ఇన్సులిన్ మోతాదును సర్దుబాటు చేయడం కూడా చాలా ముఖ్యం. ఎక్కువ సూర్యరశ్మి వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. కాబట్టి వీలైనంత వరకు లేత రంగు కాటన్ దుస్తులను ధరించండి.
ఆహారం.. క్యాబేజీ, మెంతికూర, బచ్చలికూర, పొట్లకాయ వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆకు కూరలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
సిట్రస్ ఫ్రూట్స్
నిమ్మకాయ, జామకాయ, నారింజ, దోసకాయ, పుచ్చకాయ, కొబ్బరి నీళ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఇది వేసవిలో డీ హైడ్రేషన్‌ను నివారిస్తోంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండేందుకు మామిడి, జాక్‌ఫ్రూట్ వంటి అధిక కేలరీల పండ్లను మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి