Rudrudu OTT: ఓటీటీలోకి లారెన్స్‌ ఇంటెన్స్‌ మాస్‌ యాక్షన్‌ మూవీ.. ‘రుద్రుడు’ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

త‌మిళంలో రుద్ర‌న్ పేరుతో తెర‌కెక్కిన ఈ సినిమా తెలుగులో రుద్రుడు పేరుతో ఏప్రిల్‌ 14న రిలీజైంది. మాస్‌ ఆడియెన్స్‌ను లక్ష్యంగా పెట్టుకుని రూపొందిన రుద్రుడు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కొంతమేర విజయం సాధించింది. లారెన్క్‌ మార్క్‌ డైలాగులు, ఫైట్లు మాస్‌ ఫ్యాన్స్‌ను మెప్పించాయి.

Rudrudu OTT: ఓటీటీలోకి లారెన్స్‌ ఇంటెన్స్‌ మాస్‌ యాక్షన్‌ మూవీ.. 'రుద్రుడు' స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Rudrudu Movie
Follow us
Basha Shek

|

Updated on: Apr 29, 2023 | 7:01 PM

రాఘవ లారెన్స్‌ చాన్నాళ్ల తర్వాత హీరోగా నటించిన చిత్రం రుద్రుడు. కతిరేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లారెన్స్‌కు జోడీగా ప్రియా భ‌వానీ శంక‌ర్ న‌టించింది. శ‌ర‌త్‌కుమార్ విల‌న్ పాత్ర‌లో నటించాడు. త‌మిళంలో రుద్ర‌న్ పేరుతో తెర‌కెక్కిన ఈ సినిమా తెలుగులో రుద్రుడు పేరుతో ఏప్రిల్‌ 14న రిలీజైంది. మాస్‌ ఆడియెన్స్‌ను లక్ష్యంగా పెట్టుకుని రూపొందిన రుద్రుడు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కొంతమేర విజయం సాధించింది. లారెన్క్‌ మార్క్‌ డైలాగులు, ఫైట్లు మాస్‌ ఫ్యాన్స్‌ను మెప్పించాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. రుద్రుడు సినిమా డిజిట‌ల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ స‌న్ నెక్స్ట్ కొనుగోలు చేసింది. మే 12 లేదా 19 ఏదో ఒక తేదీన లారెన్స్‌ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు సమాచారం. మే మొదటి వారంలో రుద్రుడు ఓటీటీ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

ఇక కథ విషయానికొస్తే.. రుద్ర ఐటీ ఉద్యోగిగా పని చేస్తుంటాడు. అయితే రుద్ర ఫ్యామిలీపై పగ పెంచుకున్న విలన్‌ శ‌ర‌త్ కుమార్‌ అతని భార్యతో పాటు తల్లిని దారుణంగా హత్య చేస్తాడు. మరి ఈ మర్డర్స్‌ రుద్ర జీవితంపై ఏ విధంగా ప్రభావం చూపాయి. హంతకుడిపై రుద్ర ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే ఈ సినిమా కథాంశం. సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఠాగూర్ మ‌ధు రుద్రుడు సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.