AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంతార మూవీ మిమిక్రీ వివాదం.. రణవీర్‌సింగ్‌కు కర్నాటక హైకోర్టులో ఊరట..

కాంతార సినిమా మిమిక్రీ వివాదం నేపథ్యంలో బాలీవుడ్‌ నటుడు రణవీర్‌సింగ్‌కు కర్నాటక హైకోర్టులో ఊరట లభించింది. రణవీర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలని రణవీర్‌కు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ వివాదం పై కన్నడిగులకు ఇప్పటికే క్షమాపణలు చెప్పాడు రణవీర్‌

కాంతార మూవీ మిమిక్రీ వివాదం.. రణవీర్‌సింగ్‌కు కర్నాటక హైకోర్టులో ఊరట..
Ranveer Singh
Rajeev Rayala
|

Updated on: Feb 24, 2026 | 6:25 PM

Share

కాంతార సినిమా సీన్‌ను మిమిక్రీ చేసిన వివాదంలో ఇరుక్కున్న బాలీవుడ్‌ నటుడు రణవీర్‌సింగ్‌కు కర్నాటక హైకోర్టులో ఊరట లభించింది. రణవీర్‌పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కర్నాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సినిమాలో దైవిక సన్నివేశాన్ని కించ పరిచేలా రణ్‌వీర్‌ సింగ్‌ అనుకరించారని, అందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ న్యాయవాది కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

గత ఏడాది గోవా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా వేడుకల్లో.. రణ్‌వీర్‌సింగ్‌  మాట్లాడుతూ ‘కాంతార’లో రిషబ్‌శెట్టి నటనను మెచ్చుకున్నారు. సినిమాలో ఉన్న ‘పంజుర్లి’ హావభావాలను వేదికపై ప్రదర్శించారు. అప్పుడే రిషబ్‌శెట్టి అలా చేయొద్దంటూ ఆయనను వారించారు. అయితే, రణ్‌వీర్‌ ఇలా చేయడంపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రణ్‌వీర్‌ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

ఇలాంటి సీన్లలో నటించడం చాలా కష్టమని , రిషబ్‌శెట్టి అద్భుతంగా నటించాడని అన్నారు రణవీర్‌సింగ్‌. దేశం లోని అన్ని సంప్రదాయాలపై తనకు గౌరవం ఉందని , తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపడితే క్షమించాలని అని రణవీర్‌ కోరారు.  కాగా ఇటీవల దురంధర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రణవీర్. ఈ సినిమా భారీ హిట్ సొంతం చేసుకుంది. మార్చి 19వ తేదీ ధురంధర్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలను ఏర్పడ్డాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రణవీర్‌సింగ్‌కు కర్నాటక హైకోర్టులో ఊరట..
రణవీర్‌సింగ్‌కు కర్నాటక హైకోర్టులో ఊరట..
ఇంట్లో తండ్రి మృతదేహం.. పరీక్ష హాల్లో తనయుడు పుట్టెడు దుఃఖంతో..
ఇంట్లో తండ్రి మృతదేహం.. పరీక్ష హాల్లో తనయుడు పుట్టెడు దుఃఖంతో..
ఎన్నికల ఎఫెక్ట్.. ఐపీఎల్ 2026 షెడ్యూల్ పై బీసీసీఐ సంచలన నిర్ణయం
ఎన్నికల ఎఫెక్ట్.. ఐపీఎల్ 2026 షెడ్యూల్ పై బీసీసీఐ సంచలన నిర్ణయం
కేంద్రం కొత్త నిర్ణయం.. దేశవ్యాప్తంగా బాలికలకు ఇది ఫ్రీ..
కేంద్రం కొత్త నిర్ణయం.. దేశవ్యాప్తంగా బాలికలకు ఇది ఫ్రీ..
ముస్లింల కోసం కదిలివచ్చిన హిందూ కుటుంబం.. వాళ్లు చేసిన పని ఏంటంటే
ముస్లింల కోసం కదిలివచ్చిన హిందూ కుటుంబం.. వాళ్లు చేసిన పని ఏంటంటే
కసాయిగా మారిన కన్నతల్లి.. పాసిపాప నోట్లో గుడ్డలు కుక్కి..
కసాయిగా మారిన కన్నతల్లి.. పాసిపాప నోట్లో గుడ్డలు కుక్కి..
టాలీవుడ్‌పై హీరోయిన్ల విమర్శలు.. ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకో మరి.
టాలీవుడ్‌పై హీరోయిన్ల విమర్శలు.. ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకో మరి.
బాబా వంగా చెప్పిందే నిజమవుతుందా..? ఏలియన్స్ సీక్రెట్ ఫైళ్ల..
బాబా వంగా చెప్పిందే నిజమవుతుందా..? ఏలియన్స్ సీక్రెట్ ఫైళ్ల..
లాంఛనంగా మొదలైన జై హనుమాన్ సినిమా
లాంఛనంగా మొదలైన జై హనుమాన్ సినిమా
ఉస్తాద్ భగత్ సింగ్‌లో అవేం ఉండవు.. బాంబు పేల్చిన హరీష్ శంకర్..!
ఉస్తాద్ భగత్ సింగ్‌లో అవేం ఉండవు.. బాంబు పేల్చిన హరీష్ శంకర్..!