AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముస్లింల కోసం కదిలివచ్చిన హిందూ కుటుంబం.. వాళ్లు చేసిన పని ఏంటో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు

హైదరాబాద్‌లో ఓ హిందూ కుటుంబం రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింల కోసం గొప్ప పని చేసింది. గుడిమల్కాపూర్ దయానంద్ కుటుంబం మసీదుకు పండ్లు తీసుకెళ్లి ఇఫ్తార్ సమయంలో అందించింది. ఈ సర్వమత సౌభ్రాతృత్వ చర్య తెలుగు రాష్ట్రాల్లోనే కాక, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ భారతదేశ సంస్కృతిని చాటుతోంది.

ముస్లింల కోసం కదిలివచ్చిన హిందూ కుటుంబం.. వాళ్లు చేసిన పని ఏంటో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు
Hindu Family Offers Fruits
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Feb 24, 2026 | 6:55 PM

Share

భారతదేశం సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రతీక చిన్నప్పుడు పుస్తకాల్లో చదివాం.. ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింల కోసం ఓ హిందూ కుటుంబం కదిలి వచ్చింది. తమకు కులమత భేదాలు, జాతి తేడాలు లేవని నిరూపించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

హైదరాబాద్ మహా నగరంలోని గుడిమల్కాపూర్ ప్రాంతానికి చెందిన దయానంద్ హిందూ మతానికి చెందిన వ్యక్తి. అతడు తన కుటుంబ సభ్యులతో కలిసి చేసిన గొప్ప పనిని ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ వాళ్లేం చేశారో తెలుసా?.. రంజాన్ మాసంలో ఉపవాసాల్లో ఉన్న ముస్లింల కోసం పండ్లు తీసుకుని మసీదుకు వెళ్లారు. సూర్యుడు అస్తమించే సమయంలో ఉపవాస దీక్ష విరమించే సమయానికి ముందు ఆ కుటుంబం పెద్దమొత్తంలో పండ్లు ఇవ్వడానికి రావడం చూసి మసీదులో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింలు ఆ పండ్లను ప్రేమగా స్వీకరించారు. పండ్లను తీసుకొచ్చిన దయానంద్ కుటుంబం కూడా ముస్లిలు మసీదులో ఏ విధంగా ప్రార్ధనలు నిర్వహిస్తారో, వాళ్ల పద్దతులు ఎలా ఉంటాయనేది చాలా ఆసక్తిగా తిలకించారు. దయానంద్ కుటుంబం చూపించిన ఆదరణ, ప్రేమతో పాటుగా  మసీదులో మహిళలు కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో తలపై చీర కొంగు వేసుకుని రావడం పలువురిని ఆకర్షించింది.

వీడియో ఇక్కడ చూడండి…

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ మహా నగరం కులమతాలకి అతీతంగా గంగా జమున తహసీబ్ అనే మాటలకు ఈ సంఘటన కళ్లకు కట్టినట్లుగా చూపించింది. దయానంద్ కుటుంబం చేసిన ఈ గొప్ప పనికి తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ.. సామరస్యంగా మెలుగుతున్న ఇలాంటివారు ఎంతో మందికి ఆదర్శమని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీలను ఆశ్రయిస్తున్నారా.. జాగ్రత్త
పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీలను ఆశ్రయిస్తున్నారా.. జాగ్రత్త
వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త
వందే భారత్ స్లీపర్ రైళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త
ఇంగ్లండ్‌తో నేడు బిగ్ ఫైట్..పాకిస్థాన్ సెమీస్ ఆశలు గట్టెక్కేనా?
ఇంగ్లండ్‌తో నేడు బిగ్ ఫైట్..పాకిస్థాన్ సెమీస్ ఆశలు గట్టెక్కేనా?
రైలు నడిపే లోకో పైలట్ జీతం ఎంతో తెలుసా..? మీరు అస్సలు ఊహించలేరు..
రైలు నడిపే లోకో పైలట్ జీతం ఎంతో తెలుసా..? మీరు అస్సలు ఊహించలేరు..
అయ్యప్పమాలలో వెడ్డింగ్ పార్టీకి రామ్ చరణ్.. అల్లు శిరీష్ క్లారిటీ
అయ్యప్పమాలలో వెడ్డింగ్ పార్టీకి రామ్ చరణ్.. అల్లు శిరీష్ క్లారిటీ
డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ ఏమన్నారంటే..
డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ ఏమన్నారంటే..
రణవీర్‌సింగ్‌కు కర్నాటక హైకోర్టులో ఊరట..
రణవీర్‌సింగ్‌కు కర్నాటక హైకోర్టులో ఊరట..
ఇంట్లో తండ్రి మృతదేహం.. పరీక్ష హాల్లో తనయుడు పుట్టెడు దుఃఖంతో..
ఇంట్లో తండ్రి మృతదేహం.. పరీక్ష హాల్లో తనయుడు పుట్టెడు దుఃఖంతో..
ఎన్నికల ఎఫెక్ట్.. ఐపీఎల్ 2026 షెడ్యూల్ పై బీసీసీఐ సంచలన నిర్ణయం
ఎన్నికల ఎఫెక్ట్.. ఐపీఎల్ 2026 షెడ్యూల్ పై బీసీసీఐ సంచలన నిర్ణయం
కేంద్రం కొత్త నిర్ణయం.. దేశవ్యాప్తంగా బాలికలకు ఇది ఫ్రీ..
కేంద్రం కొత్త నిర్ణయం.. దేశవ్యాప్తంగా బాలికలకు ఇది ఫ్రీ..